అంతర్జాతీయ సంతోష దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే ?


నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మార్చి 20న జరుపుకుంటారు.  ఇది 28 జూన్ 2012న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది.ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ జీవితంలో సంతోషం యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2015  వ సంవత్సరంలో  ఐక్యరాజ్యసమితి ప్రజల జీవితాలను సంతోషంగా మార్చడానికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రారంభించింది. దీని ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు పేదరికాన్ని నిర్మూలించడం, అసమానతలను తగ్గించడం మరియు మన గ్రహాన్ని రక్షించడం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకోవడానికి అన్ని వయసుల వారిని ఆహ్వానిస్తుంది.ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ స్థాపించబడటానికి ముందు, వరల్డ్ హ్యాపీనెస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ లూయిస్ గల్లార్డోతో కలిసి, జేమ్ ఇలియన్ "హ్యాపీటలిజం"ని స్థాపించారు. ఇలియన్ 2006 నుండి 2012 వరకు ఐక్యరాజ్యసమితిలో సంతోషం, శ్రేయస్సు మరియు ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యతను ప్రోత్సహించడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రచారాన్ని నిర్వహించారు.


2011  వ సంవత్సరంలో, జేమ్ ఇలియన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఆలోచనను ప్రతిపాదించారు. ఈ ఆలోచనను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అధికారికంగా 2012లో స్థాపించబడింది. 2013 వ సంవత్సరంలో దీనిని మొదటిసారిగా స్మరించుకోవడం జరిగింది. జేమ్ ఇలియన్ భావన ఆధారంగా ఐక్యరాజ్యసమితి ప్రజల జీవితాల్లో ఆనందం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ సంతోష దినోత్సవంతో ఒక అడుగు ముందుకు వేసింది. ప్రజా విధానాలలో ఆనందాన్ని చేర్చాలని భావించి ఈ రోజుని ప్రకటించింది.వరల్డ్ హ్యాపీనెస్ డే నాడు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రజలు మరింత నిరంతర ప్రగతిని సాధించాలని ఇంకా వారి జీవితాలను మెరుగుపర్చడానికి కొనసాగించే చిన్న విషయాలకు పిలుపునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: