అసలే వర్షాకాలం దానికి తగ్గట్టు ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తి వల్ల అందరిలో ఆందోళన మొదలయినది. చిన్నపిల్లల గూర్చి అయితే చెప్పక్కర్లేదు. మాములుగా చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే చిన్నపిల్లలు తరుచూ రోగాల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అందుకనే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్ధాలు పెడుతూ ఉండాలి. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు.. దాంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహార  పదార్థాలు గూర్చి తెలుసుకుందామా... !

 


చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది. అలాగే పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలకు పెరుగు అన్నం మధ్యాహ్నం పూట పెట్టడం మంచిది.అలాగే పిల్లలకు సిట్రస్ పండ్లు పెడుతూ ఉండాలి. పుల్లని పదార్ధాలు తినడానికి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అందుకనే నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి, నిమ్మకాయ  తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్ 'సి'పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

 


అలాగే నట్స్ తినడం వల్ల కూడా పిల్లలకు చాలా మంచిది. పిల్లలకు రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది.కనీసం రోజుకు రెండు లేదా మూడు బాదాం పప్పులు నీటిలో నానపెట్టి ఉదయాన్నే తినిపిస్తే మంచిది పోషకాలు లభిస్తాయి. పిల్లలకు విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే కనీసం వారానికి మూడు సార్లు అయిన ఆకుకూరలు పెడుతూ ఉండాలి.సీజన్లలో దొరికే పండ్లు కూడా పెడుతూ ఉండాలి. పిల్లల్లో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటేనే పిల్లలు రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: