ఇప్పటి కాలంలో చాలామంది పిల్లలు ఎదుర్కునే ప్రధాన సమస్య ఎత్తు పెరగకపోవడం.కొంతమంది పిల్లలలో  పెరుగుదల చాలా తక్కువుగా ఉంటోంది. ఈ పెరుగుదలకు ముఖ్యంగా వంశపారంపర్యం ఒక కారణం.చాలా వరకూ తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు అనేది  ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు లేదంటే పెరుగుదల ఉండదు. కానీ ఒక్కోసారి మనం పిల్లలకు సరియైన పోషకాహారం పెట్టకపోవడం వల్ల కూడ పిల్లలలో పెరుగుదల ఆగి పోయే అవకాశం ఉంది.పిల్లలలు టీనేజ్ వయసు వచ్చాక ఎత్తు అనేది పెరుగుతారు. ఈ సమయంలో పెరుగుదలకు సంబందించిన హార్మోను ఎక్కువుగా విడుదల అవుతుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది..



పోషకాలు, న్యూట్రీషియన్స్ పొడవు పెరగడానికి అద్బుతంగా సహాయపడుతాయి.అందుకని పోషకాలతో కూడిన ఆహారం పిల్లలకు పెట్టాలి.అలాగే పిల్లలలో ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. ఎత్తు పెరగడం మొదలైనప్పుడు వ్యాయామాల వల్ల శరీరంలోని కండరాలు వదులు అయి ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలు  తీసుకోవడం వల్ల కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు. అవేంటో తెలుసుకుందాం.. !!ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం అంది, ఎముకల పెరుగుదలకు సహాయపడి, వ్యాధినిరోధకత పెరిగి పెరుగుదల మెరుగుపడుతుంది.



ప్రోటీలు అధికంగా ఉన్న ఆహారాలు ఎఫెక్టివ్ గా పొడవు పెరుగుటలో సహాయపడతాయి.ప్రతి రోజు పిల్లలకు తప్పకుండా పాలు ఇస్తూ ఉండాలి.పాలు తాగడం వల్ల పిల్లలలో కాల్షియం ఎక్కువ అవుతుంది.అలాగే మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పిల్లల  పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.అలాగే ప్రతిరోజు పిల్లలతో వ్యాయామం చేయించడం, సైకిల్ తొక్కించడం, స్కిప్పింగ్ ఆడించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: