రాష్ట్రంలో నూతన బడ్జెట్ లు వచ్చేశాయి. ప్రతి ఏడు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలయ్యాక కొత్త కేటాయింపులతో పాటుగా కొత్త నిబంధనలు కూడా అమలులోకి వస్తాయి. అయితే అవేంటో తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకావాల్సి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు గురించి తెలుసుకుని మార్చి 31 లోపు పూర్తి చేయకపోతే నష్ట పోవాల్సి ఉంటుంది. ఇపుడు అవేంటో తెలుసుకుందాం పదండి....

పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ : పాన్ నంబర్ కి ఆధార్ లింక్ చేయడానికి గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఇక
ఆధార్ లింకింగ్ గడువు విషయానికొస్తే మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడగించినప్పటికీ అప్పటికి కూడా పాన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో చట్ట ప్రకారం లింకు చేయడంలో విఫలమైనట్లయితే, వారిపై ప్రభుత్వం నియమాల ప్రకారం చర్యలు ఉంటయాని తెలుస్తోంది.

పన్ను: ఈ నూతన సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి గాను సెక్షన్ 80C ప్రకారం పన్ను ఆదా కొరకు మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకొనుటకు ఇపుడు అనువైన సమయం. మీరు ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన పన్ను ఆదా పథకాలలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లైతే , ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం కొరకు  మార్చి 31 లోగా కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంది. లేదంటే మీ ఖాతాలు క్లోజ్ చేసే అవకాశం ఉంది.

కేవైసీ అప్‌డేట్: బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి కూడా మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ చెప్పిన ఇతర  సమాచారంతో కేవైసీ ను  అప్‌డేట్ చేయాల్సి ఉంది.

ఆదాయపు పన్ను రిటర్న్: అదే విధంగా జరిమానా పడకుండా ఉండాలి అంటే త్వరపడి ముందే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చివరి తేదీ అనగా గడువు తేదీని మార్చి 31, 2022 కంటే ముందే ఫైల్ చేయండి ఉత్తమం.

ఇలా పైన చెప్పిన విషయాలను ఈ నెలాఖరు లోపల పూర్తి చేసుకుంటే ఆయా చట్టాల ప్రకారం మీరు నష్టపోవడం ఖచ్చితమని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: