ఇవాళ కాలంలో దుర్భరమైన జీవనశైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండడం వల్ల జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎటువంటి పరిస్థితులలోనూ అల్పాహారం సమయానికి తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇవి జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. సరైన సమయంలో అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని, అందులో కూడా పోషకాహారం తీసుకుంటేనే ఇంత ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం చెబుతున్నారు.

యాపిల్: యాపిల్ మిగతా పండ్ల కంటే చాలా రుచికరంగా ఎన్నో పోషకాలను నిండివుంటుంది. ముఖ్యంగా ఆపిల్ లో మనకు మినరల్స్ , విటమిన్ ఏ,  పొటాషియం,  విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అరటి పండు: అరటి పండును అనేక విధాలుగా తినవచ్చు ముఖ్యంగా జ్యూస్ , సలాడ్ రూపంలో అరటి పండును తీసుకోవచ్చు. ముఖ్యంగా అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

అటుకుల ఉప్మా:
ప్రతిరోజు ఉల్లిపాయ, ఆవాలు, అటుకులు, వేరుశెనగలు, దానిమ్మ, ఉప్పు, కరివేపాకు ఆకులను ఉపయోగించి మీరు అటుకులతో ఉప్మా తయారు చేసుకోవచ్చు. ఇది తక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది దీనివల్ల చాలా సేపు కడుపు నిండిన భావన కూడా మనకు కలుగుతుంది . అందుకే ఎక్కువ ఆహారం తీసుకోము. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అటుకుల ఉప్మా చాలా బాగా పనిచేస్తుంది.

అల్పాహారంలో వీటిని తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: