ఈ మధ్య కాలంలో జీవనవిధానం,మారుతున్న ఆహార అలవాట్లు వివిధ అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది.ముఖ్యంగా జంక్ ఫూడ్ లో అధికంగా తీసుకోవడం వల్ల, వాటిలో ఉప్పు, కారాలు,మసాలా పదార్ధాలు ఎక్కువగా వాడుతుంటారు. వాటి కారణంగా బీపీ సమస్యలు వస్తాయి. అంతే కాక మనలోని మానసిక ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం వంటి వాటి వల్ల కూడా అధిక బీపి వస్తుంది. ఇలా పెరిగిన బిపిని కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల నియంత్రించుకోవచ్చు. అలాంటి ఆహారలెంటో ఇప్పుడు చూద్దాం..


డార్క్ చాకోలెట్..
చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చాకోలెట్స్ తింటువుంటాము. ఇందులో పాలీఫినాల్స్, ఫ్లెవనాయిడ్స్, క్యాథెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. చాకోలెట్స్ తిన్నప్పుడు, ఇది రక్తసరఫరాను మెరుగుపరచి, మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది.దీనితో ఒత్తిడి తగ్గి, బీపీ నియంత్రణలో ఉంటుంది.

అరటిపండు..
అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. రోజుకొక అరటిపండు తినడం వలన ఇందులోని పోటాషియం అధిక బీపిని కంట్రోల్ చేసి, రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.

నీరు త్రాగటం..
అధిక ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీరు నిదానంగా, కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. ఇలా రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగితే శరీరం హైడ్రేడ్ గా ఉండటమే కాక, అధిక. బీపీ నియంత్రణలో ఉంటుంది.
 
టమాటా..
టమాటాను అధికంగా తీసుకోవడం వల్ల లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్‌ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.అంతే కాక రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి,రక్తసరఫర సక్రమంగా జరిగేలా చేస్తాయి.

వెల్లుల్లి..
రోజుకు మూడు లేదా నాలుగు రెబ్బలను వంటల్లో వాడటం వల్ల,గుండె పనితీరును మెరుగుపరిచి,రక్తపోటు అదుపులో ఉంచుతుంది.మరియు చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి అధికబరువును కంట్రోల్ లో ఉంచుతుంది.

వీటితో పాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తే, అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: