అనకొండ.. ఈ పేరు చెబితేనే ఒళ్లు జలధరిస్తుంది. కేవలం సినిమాల్లోనే వీటిని మనం చూసి ఉంటాం. జూల్లోనే పెద్దగా ఈ జంతువు కనిపించదు. అందుకే.. కేరళ తిరువనంతపురం

జూ అధికారులు ప్రత్యేకంగా శ్రీలంక నుంచి మరీ వీటిని తెప్పించారు. కానీ అలా తెప్పించిన అనకొండలు వరుసగా మృత్యువాతపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

కేరళలోని తిరువనంతపురం జూలో ఓ అనకొండ మృతి చెందింది. రెండు నెలల కిందట శ్రీలంక నుంచి ఈ జూపార్క్ కు అయిదు ఆడ, రెండు మగ అనకొండలను అధికారులు తీసుకొచ్చారు.

వాటిలో ఇదివరకే రెండు అనకొండలు బ్యాక్టీరియా బారిన పడి మృతిచెందాయి. మరొకటి జతకట్టే సమయంలో చనిపోయింది.

 

 

తాజాగా అరుంధతి అనే పేరున్న ఈ పైథాన్ బ్యాక్టీరియా కారణంగా మరణించిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంతుప్రదర్శన శాలలో మూడు అనకొండలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంటమోబియా అనే బ్యాక్టీరియా కారణంగా ఈ పైథాన్లు చనిపోతున్నట్లు వైద్యులు తేల్చారు.

 

బ్యాక్టీరియాకు విరుగుడు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, మిగిలి ఉన్న మూడు అనకొండలకు కూడా వైరస్ వ్యాపించిందని వెల్లడించారు. చికిత్స కారణంగా వాటి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: