కరోనా ఇప్పుడు ఈ పేరు చెబితేనే అందరు వణికిపోతున్నారు... చైనా దేశాన్ని కుదిపేస్తోంది ఈ వైరస్.. భారత దేశంలోకి రాకుండా అధికారులు గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు... అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కానీ లాభం లేదు.. భారత్‌లోనూ కరోనా వైరస్ రెండో కేసు నమోదుకావడంతో అధికారులు మరింత్ర అప్రమత్తమయ్యారు. మూడు రోజుల కిందట కేరళకు చెందిన మెడికల్ విద్యార్ధినిలో వైరస్ సోకినట్టు బయటపడింది.




 చైనీయులు, చైనాలో నివాసం ఉన్న విదేశీయులకు ఈ-వీసాలను భారత్ తాత్కాలికంగా రద్దుచేసింది. కరోనా వైరస్ రెండో కేసు కేరళలోనే నమోదు కాగా, అతడు కూడా వుహాన్ నుంచి వచ్చిన వ్యక్తేనని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి, పీడబ్ల్యూడీ మంత్రి అత్యవసరంగా సమావేశమై పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

కరోనా వైరస్‌తో చనిపోయినవారికి అట్టహాసంగా అంత్యక్రియలు నిర్వహించరాదని చైనా ఆంక్షలు జారీచేసింది.వెంటనే కాల్చేయాలని ఆదేశాలు జారీచేసింది.. మృతదేహాలను సమీపంలోని శ్మశానాలకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేయాలని, దూర ప్రాంతాలకు తరలించవద్దని, వాటిని భద్రపరచడం కూడా చేయవద్దని పేర్కొంది. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఇలా త్వరగా అంత్యక్రియలు చేయమన్నారు.. వుహాన్ నుంచి ఫిలిప్పైన్స్ వెళ్లిన చైనా వ్యక్తి కరోనా వైరస్‌తో మృతిచెందాడు.

 


చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మరోవైపు, చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రచారం జోరందుకోగా, కొన్ని దేశాలు చైనా పర్యాటకులపై ఆంక్షలు విధించాయి. దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, వియత్నాంలోని రెస్టారెంట్లలోకి చైనీయులను అనుమతించడంలేదు. ఇండోనేషియాలో ఏకంగా చైనా పర్యాటకులు బసచేసిన హోటల్ వద్ద ర్యాలీ నిర్వహించి, వారు వెళ్లిపోవాలని నినాదాలు చేసారు. చిన్న ఉల్లిపాయాలను తింటే కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని తమిళనాడులోని కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని చెబుతున్నాడు. ఏకంగా రెస్టారెంట్ ముందు బోర్డ్ పెట్టిన యజమాని.. చిన్న ఉల్లిపాయలు వేసి నువ్వుల నూనెతో కాల్చిన ఊతప్పం తింటి కరోనా వైరస్ దరిచేరదని ఏకంగా నోటీసు బోర్డే పెట్టాడు.




శనివారం ఢిల్లీకి చేరిన వుహాన్‌లోని భారతీయులను మానేసర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, వీరిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడలేదు. వీరిని రెండు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు.తర్వాత బయటకి పంపుతారు.



అలప్పూజలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్ నమూనా పరీక్షల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌లను కేరళ ప్రభుత్వం అభ్యర్థించింది. చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన రెండో బృందాన్ని ఇండో-టిబెటన్ బోర్డ్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుచేసిన శిబిరానికి తరలించారు. మొత్తం 297 ప్రయాణికులను ఇందులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పూర్తయి వైరస్ లేదని నిర్ధారణకు వచ్చిన 14 రోజుల తర్వాత వీరిని స్వస్థలాలకు పంపుతారు.



 కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను రెండు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం తొలి విమానంలో 324 మంది ఢిల్లీకి చేరుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: