మన ఐదు చేతివేళ్లు ఒకలా ఉన్నాయా.. లేనే లేవు కదా.. ఇదే సూత్రం మన సమాజానికీ వర్తిస్తుంది. 
సమాజంలో అందరిదీ ఒకే రకం జీవితం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు. మరి అంతా సంతోషంగా ఉన్నారా... అంటే చెప్పలేం.. ఎందుకంటే.. ఆనందం మనసుకు సంబంధించింది. 

 

ఒక విధంగా చెప్పాలంటే ఆనందాన్ని అందుకోవడం అంత సులభం కాదు.. అలాగని కష్టమూ కాదు.. దానికి కావాల్సింది... కాస్త సంయమనం, ఇంకొంచెం జ్ఞానం అంతే.. ఆనందం అనేది ఎండమావి కానే కాదు... ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. ఉదాహరణకు చెప్పాలంటే.. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు.

 

ఆనందం అందుకోవాలంటే ముందు మనలో ఆ చైతన్యం ఉండాలి. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం!

మరింత సమాచారం తెలుసుకోండి: