కొంత మంది జీవితంలో ప్రతి విషయంలోనూ సెంటిమెంట్ ఫీలవుతారు. అదృష్టాన్ని నమ్ముతారు. అయితే అదృష్టం కూడా మన కృషిని బట్టే ఉంటుందని మాత్రం గుర్తుంచుకోరు. అయితే ఇలాంటి సెంటిమెంట్స్ ను తప్పుబట్టకపోయినా.. కాస్త లాజిక్ తో ఆలోచించడం మంచిది.

 

 

ఉదాహరణకు గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభ కార్యాలప్పుడూ పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను హారతి ఇస్తుంటారు. క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. అయితే ఇది సెంటిమెంట్ కాదు.. మూఢనమ్మకం అసలే కాదు.

 

 

ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూరం పొగకు నశిస్తాయి.

 

 

ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. ఇలా లాజిక్ ఆలోచించి సెంటిమెంట్స్ ఫాలో అయితే బెటర్. మరీ గుడ్డిగా దేన్నీ నమ్మడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: