శృంగారం... ప్రతి జీవికి అవసరమైన పక్రియ. నిజానికి అది లేకపోతే సృష్టి లేదు అని చెప్పవచ్చు. మనుషులకు  గాలి, నీరు, తిండి ఎలాగో ఒకానొక సమయంలో సెక్స్ కూడా అంతే అవసరం. మనుషులు వారి శారీరక సంతృప్తి కోసం మాత్రమే కాకుండా మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండడంలోనూ శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. శృంగారం ఉత్తేజాన్ని పెంచడంతోపాటు మానసిక ఆనందాన్ని కూడా ఇది ఇస్తుంది.


ఇక పోతే... భార్యాభర్తలు విషయానికి వస్తే ఆ బంధంలో ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారి మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమకు శృంగార జీవితం కూడా ప్రధానమైనది. వారి మధ్య ఎటువంటి అపోహలు ఉన్నా సరే ఈ  శృంగారం వాటన్నిటినీ పక్కనపెట్టి వారిద్దరిని దగ్గర చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న నాగరికత విషయంలో చాలామంది ఆలుమగలు వారి మధ్య లైంగిక ఈ విషయంలో సంతృప్తిగా ఉండడం లేదు. మహిళలకు వారు శృంగారాన్ని అనుభవించాలని ఉన్న భర్తల నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉంటారని చాలా అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి.


ఒకవేళ పూర్తిగా ఆ సమయంలో మునిగి పోయాక భర్త సడన్ గా విరమించుకుంటే దాంతో భార్య తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుందని ఆ సర్వేలో తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో బిజీగా ఉండడంతో ఏదో ఒకరోజు వారు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటి రోజు కూడా వారు ప్రయత్నం సజావుగా సాగడం లేదంటే నమ్మండి. అయితే ఇందుకుగాను అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి కాలం లో ఉద్యోగాల కోసం భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉంటున్నారు. దానితో వారి మధ్య గ్యాప్ రావడంతో చాలా రోజుల తర్వాత ఏదో ఒకసారి ఇద్దరు కలవడానికి మొగ్గుచూపుతుండటంతో వారి మధ్య అనుకున్నంత భావన ఏర్పడకపోవడం తో సెక్స్ లో వారి మధ్య లోనే నిలిపివేసేందుకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అధ్యయనంలో మరొక విషయం ఏమిటంటే భార్య కోరిక మేరకు సెక్స్ లో పాల్గొంటున్నప్పటికీ అయితే మధ్యలోనే వారు విరమించుకోవడంతో వారు దాన్ని తట్టుకోలేక మరొకరితో ఆ జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.
ఇది ఒక రకంగా ఉంటే ప్రస్తుతం కొత్త జంటలో కూడా శృంగార సమస్యల అధికంగానే ఉన్నాయి. మొదటి కలయికలో భర్తకి శీఘ్రస్ఖలనం సమస్య రావడంతో భార్య అసంతృప్తిగా మిగిలిపోతోంది. అంతేకాకుండా అనేక కారణాలతో శృంగారం విషయంలో కూడా భర్తల విషయంలో భార్య అసంతృప్తిగానే ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: