కొన్ని బంధాలు మన కష్టాలను రెట్టింపు చేస్తాయి.. మరికొన్ని బంధాలు వాటిని సగానికి సగం తగ్గించి వేస్తాయి. కొన్ని బంధాలు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాంటి బంధాల్లో స్నేహం ఒకటి. స్నేహానికి కులమత, బాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఆస్తులు అంతస్తులు, అధికారం, హాదా, స్థాయి వంటి వాటితో సంబంధం లేదు.

 

 

 

మంచి మనసు మమతానురాగాలను పంచుకునే మనస్తత్వాన్ని కోరుకుంటుంది స్నేహం. కులం, మతం ఏదైనా ఎవరి విలువ వారిదే. కానీ ఎవరు ఎవరితో స్నేహం చేయాలన్నా , మొదట వారికి స్నేహం యొక్క విశిష్టత తెలిసి, స్నేహాన్ని మరియు స్నేహితుడిని గౌరవించడం తేలియాలి, లేదంటే భవిష్యత్తులో జరిగే పొరపాటుకు సిగ్గు పడవలసి వస్తుంది.

 

 

 

అన్ని బంధాల్లాగానే ఒక్కోసారి స్నేహానికి ఇబ్బందులొస్తాయి.. అపోహలు వేరు చేసేందుకు ప్రయత్నిస్తాయి.. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహమనే నిధిని వదిలి పెట్టకూడదు. ఈ విషయంలో ఒక మెట్టు దిగి అయినా సరే.. అపోహలు తొలగించుకోవాలి. ఎందుకంటే.. స్నేహం ఇచ్చే సాంత్వన, ఊరట, ప్రశాంతత మిగిలిన బంధాల్లో లభించదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: