ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన మనం అనారోగ్యానికి గురి అవుతున్నాము.ఆడవాళ్లు కూడా ఇప్పుడు అసిడిటీ సమస్య వలన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్లు ఇంట్లో  అందరి బాగోగులు చూసి అందరూ తినడం అయి పోయిన తర్వాత తీరిగ్గా ఎప్పుటికో తింటారు. అదికూడా ఒక సమయానుకూలంగా తినరు ఆదరాబాదరాగా నాలుగు మెతుకులు తింటూ ఉంటారు. దానికి ఫలితంగా ఎసిడిటీ సమస్య కొని తెచ్చుకుంటారు. అందుకనే ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం జీవన శైలి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మరి అవేంటో మనం తెలుసుకుందామా..



చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే.ఏమి తినకుండా  నాలుగు ఐదు గంటల కంటే ఎక్కువ సేపు పొట్టను ఖాళీగా ఉంచకూడదు.ఇలా చాలా సేపు పొట్ట ను ఖాళీగా ఉంచడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఎక్కువ మోతాదులో విడుదల అవుతాయి. తర్వాత కడుపులో గొంతులో ఎక్కువ మంట మొదలవుతుంది అందుకే ఉదయం మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య ఎక్కువ విరామం లేకుండా తప్పని సరిగా చూసుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఆహారాన్ని మెల్లగా నమిలి మింగాలి. చాలా మంది పెద్ద పెద్ద ముద్దలను కలిపి గబగబా తినడం వల్ల వాటిని జీర్ణం చేయడానికి పొట్ట ఎక్కువ ఆమ్లాలను విడుదల చేయాల్సి ఉంటుంది.



అలాగే మనం తీసుకునే ఆహారంలో  ఎక్కువగా పండ్లు, కూరగాయలు,  ఆకుకూరలు పప్పులు,  తృణ ధాన్యాలు,  ఎండు ఫలాలు లాంటి ఆరోగ్యకరమైన,  సులువుగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.  ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్, బాగా శుద్ధి చేసిన ఆహారం, ఉప్పు,  చక్కెర లాంటి ఆహారనికి దూరంగా ఉండడం చాలా మంచిది .మందుల వాడకాన్ని చాల వరకు తగ్గించాలి యాంటీ బయోటిక్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను తగ్గించి చెడు బ్యాక్టీరియాను పెంచి పొట్ట లోని ఆమ్లత్వాన్ని .ఆహారంతో పాటుగా తగినన్ని మంచి నీళ్లు తీసుకోవాలి.అలాగే యోగా చేయడం ప్రాణాయామం కొన్ని శ్వాస సంబంధ వ్యాయమాలు చేయడం ఎసిడిటీ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల ఎసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: