బంగారం అంటే మ‌న‌కు కొన్నే గుర్తుకొస్తాయి. న‌గ‌లు, లేదా గోల్డ్ బిస్కెట్లు, ఇత‌ర ధ‌రించే వ‌స్తువులు మాత్ర‌మే మ‌నం ఇంత‌వ‌ర‌కు చూశాం క‌దా. ఇంకొంద‌రైతే వేసుకునే బ‌ట్ట‌ల‌ను కూడా బంగారంతో చేయించుకుంటున్నారు. కానీ ఇల్లును క‌ట్ట‌డం ఎప్పుడైనా చూశారా. నిజ‌మేనండి ఇల్లును కూడా బంగారు పూత‌తో క‌ట్టారు. ఒక‌టి కాదు చాలా ఉన్నాయి ఇలాంటివి. అవి ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో చూద్దాం.


క్యోటో అంటే ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు భూత‌ల స్వ‌ర్గం. ఇక ఇక్క‌డ గోల్డెన్ పెవిలియన్ పేరుతో బంగారు పూత‌తో భ‌వ‌నం ఉంది. దీనిని 14వ శతాబ్ధపు యోధుడికి రిటైర్మెంట్ విల్లాగా వాడారు. దీనిని కింకకుజీ అని కూడా పిలుస్తారు. ఈ బిల్డింగ్ మొదటి రెండు అంతస్తులు బంగారు ఆకులతో కప్పబడి వెరైటీగా త‌యారు చేశారు. 1950 లో ఆలయ సన్యాసి చేత పైకప్పు కాలిపోయింది. దీంతో 1955 లో బంగారు పూత‌తో పైక‌ప్పును నిర్మించారు.  



ఇక మ‌న‌దేశంలో కూడా ఓ గోల్డ్ నిర్మాణం ఉంది. అమృత సర్ లోని గోల్డెన్ టెంపుల్.. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన బంగారు నిర్మాణాలలో ఒకటి. ఈ ఆలయాన్ని శ్రీ దర్బార్ సాహిబ్ లేదా శ్రీ హర్మాండిర్ సాహిబ్ అని పేర్లు ఉన్నాయి. దీన్ని పూర్తిగా బంగారు పూత‌తో కప్పబడి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆల‌యాన్ని సిక్కులు ఆధ్యాత్మికంగా కొలుస్తారు. ఈ ఆల‌యానికి ఉన్న ప్రతి తలుపుకు పైన ఉన్న గోపురాలను 2018 లో సుమారు 160 కిలోల బంగారంతో అలంకరించారు.


 
అలాగే థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని గ్రాండ్ ప్యాలెస్ ఒకటి. థాయ్ రాజ కుటుంబానికి సుమారు 150 సంవత్సరాలు ఇందులో నివసించింది. ఇవాళ ఇది ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్. దీని గోడలు బంగారు పూత‌తో ఉంటాయి. అలాగే మయన్మార్‌లోని యాంగోన్‌లో శ్వేదాగన్ పగోడా. ఇది అందమైన మైలురాయి బంగారంతో కప్పబడి ఉంది. దీంతోపాటు ఇంకోటి డోమ్ ఆఫ్ ది రాక్, జెరూసలేం. డోమ్ ఆఫ్ ది రాక్ భ‌వ‌నం పూర్తిగా బంగారు పూతతో పైకప్పును క‌ప్పారు. ఇలా అనేక రకాల బంగారు భ‌వ‌నాలు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తంపు తెచ్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: