భారత్ భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆలవాలం. మన దేశంలో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి పోలిక ఉన్నప్పటికీ భిన్న వ్యవహారాలు, పద్ధతులను ప్రజలు అవలంభించడం మనం గమనించొచ్చు. అయితే, ఒక ఏరియా కట్టుబాట్లు ఇంకో ఏరియా వారికి ఫన్నీగా, వింతగా అనిపిస్తాయి. కానీ, అది అక్కడ ఉండే సంప్రదాయం. భారత పురాణాల నుంచి మొదలుకుని నేటి వరకు స్త్రీని మాతగా భావించే దేశం మనది. దేశాన్ని కూడా భారత మాతతో పోల్చుతాం. ఈ క్రమంలో స్త్రీలు ఆ ప్లేస్‌లో డిఫరెంట్‌గా పూజలు చేస్తారట. ఆ పద్ధతి చూస్తే మీరు ఆశ్చర్యపోతారట. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి? అక్కడ మహిళలు ఎలాంటి వింత ఆచారాన్ని పాటిస్తారు. తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.


భారత్ సందర్శనకు పర్యాటకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని పురాతన కట్టడాలు, ప్రదేశాలు చూసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే పర్యాటకులు మెచ్చే ప్లేస్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా పర్యాటకం ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కులు, మనాలి అనే ప్రదేశాలు అత్యద్భుతంగా ఉంటాయి. కులు అనే జిల్లాలోని హిని అనే గ్రామం ప్రత్యేక పద్ధతికి కేరాఫ్ అట. సముద్రమట్టానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామానికి నిత్యం అనేక ప్రదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు.


 ఇక్కడ గైన్ అనే దేవత కొలువుదీరి ఉంది. ఆమె పురాతన కాలంలో రాక్షసులను సంహరించిందని స్థానికులు చెప్తున్నారు. సదరు దేవత అనుగ్రహం కోసం ప్రజలు ఏటా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఐదు రోజులు పాటు మహిళలు శరీరంపై నూలు పోగు లేకుండా పూజలు చేస్తారు. చిన్న బట్ట మాత్రమే కట్టుకుని ఉపవాసం చేస్తారు. గ్రామంలోని ఆ దేవతామూర్తి ఆలయం ఎదుట స్నానాలు ఆచరిస్తారు. కొద్ది పాటి ఆహారం తీసుకుంటూ నిష్టగా పూజలు చేస్తారు. ఇలా ఈ ఆచారాన్ని పాటించడం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వింత ఆచారాన్ని చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. స్త్రీని అత్యంత గౌరవించే దేశంలో నగ్నంగా ఉంచి పూజలు చేయడం ఏంటి? అనే అభిప్రాయాలను పలువురు విదేశీ పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: