మీరు ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం పూట ఉపయోగించిన తర్వాత హ్యాండ్ సింక్ ను తుడవడం మంచిది.. ఇందుకోసం మీరు డాట్ గ్లోజ్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే వీటిని మీరు మీ బాత్ రూమ్ లోనే పెట్టుకోవడం వలన రోజుకు రెండు సార్లు ఈజీగా శుభ్రం చేయడానికి వీలు ఉంటుంది.. అయితే కొంచెం ఇబ్బంది అనిపించినా.. తర్వాత తర్వాత బాత్రూం శుభ్రంగా ఉండడం చూసి మీకే శ్రద్ధ వస్తుంది.
మీరు స్నానం చేసేటప్పుడు షవర్ ను ఉపయోగిస్తారు కాబట్టి ప్రతిసారి బాత్రూము శుభ్రం చేసుకోవడం మంచిది. ఎందుకంటే స్నానం చేసిన వెంటనే గోడలపై షాంపూ ,సబ్బు మరకలు ఉంటాయి.. కాబట్టి తడిసిన గోడలను తుడవడం చాలా సులభం.
బాత్రూమ్ డోరు కింది వైపు అలాగే ముఖ్యంగా లోపల వైపు కూడా శుభ్రం చేసుకోవాలి.. వెనుక చూడ్డానికి అపరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, వారానికి ఒక సారి శుభ్రం చేసినా చాలు మెరుస్తూ ఉంటుంది.
ఇక టాయిలెట్ ను ఉపయోగించిన ప్రతిసారి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి..లేదంటే టాయిలెట్ నుంచి వచ్చే దుర్వాసన ను తట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతిసారి క్లీన్ చేసుకోవడం ఉత్తమం.. అంతేకాకుండా మార్కెట్లో దొరికే సువాసన భరితమైన జెల్ ప్యాకెట్స్ తెచ్చుకొని బాత్రూంలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి సువాసన వస్తుంది.