మనం మన వంటింట్లో ఎక్కువగా రసాన్ని తయారు చేస్తూ ఉంటాం. రసం చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కూడా రసంతో  అన్నాన్ని చాలా ఇష్టంగా తింటారు.అందరూ బాగా ఇష్టపడే ఈ రసాన్ని మనం మరింత రుచిగా ఇంకా మరింత ఘాటుగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇలా తయారు చేసిన రసాన్ని తీసుకోవడం వల్ల రుచికి రుచిని ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవడచ్చు. మరింత రుచిగా ఇంకా మరింత ఘాటుగా ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు జార్ లో మసాలా దినుసులు, కరివేపాకు కూడా వేసి  మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ ఇంకా కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు ఇంకా పసుపు వేసి కలపాలి.


ఆ టమాట ముక్కలు మెత్తగా అయ్యే దాకా వేయించిన తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, మూడు గ్లాసుల నీళ్లు ఇంకా ఒక చిన్న బెల్లం ముక్క వేసి కలపాలి. తరువాత రసాన్ని మధ్యస్థ మంటపై ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా వుండే స్పైసీ రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ రసంతో అన్నం తినడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు ఇంకా గొంతు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా రసాన్ని తయారు చేసుకుని తినడం వల్ల చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ రసాన్ని తయారు చేసుకొని తాగండి. జలుబు, దగ్గు నుంచి ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: