మనల్ని బాగా వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఖచ్చితంగా నడుము నొప్పి కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు.మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలో ఇది కూడా ఒకటి. నడుము నొప్పితో బాధపడే వారు ఇప్పుడు చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా ఈజీ. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు గోధుమలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. ఆ తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నెయ్యిని వేసి వేడి చేయాలి.ఆ నెయ్యి వేడయ్యాక ఆరిన గోధుమనలు వేసి వేయించాలి.తరువాత వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో బాదంపప్పు వేసి రంగు మారే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.అలాగే ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయాలి.ఆ తరువాత గోంధం ను వేసి వేయించాలి. దీనిని చక్కగా పొంగే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇంకా అలాగే ఫూల్ మఖనాను అలాగే ఎండు కొబ్బరిని కూడా విడివిడిగా వేసి వేయించి వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.


ఇక ఇప్పుడు ముందుగా ఒక జార్ లో వేయించిన గోధుమలను తీసుకోవాలి. ఇందులోనే యాలకులు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇదే జార్ లో వేయించిన మిగిలిన పదార్థాలన్నీ వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఇవి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి.ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుము ఇంకా నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి గులాబ్ జామున్ పాకం అయ్యే దాకా మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టాలి. వడకట్టిన బెల్లం పాకాన్ని ముందుగా రెడీ చేసుకున్న గోధుమల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే గోధుమల లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా తయారవుతుంది.జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా మీరు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: