మన శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. విటమిన్ డి అనేది లోపించడం వల్ల ఎముకలు గుల్లబారుతాయి.అయితే ఎముకలకు సంబంధించిన సమస్యల బారిన పడాల్సి వస్తుంది.ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. అందువల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.అలాగే ఒత్తిడి, ఆందోళన వంటివి ఎక్కువవుతాయి. ఇంకా ఈ విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం వల్ల అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా మనం ఈజీగా మన శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.అలా మన శరీరానికి తగినంత విటమిన్ డి ని అందించే ఒక పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక ఈ పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా కళాయిలో అర కప్పు బాదంపప్పు వేసి దోరగా వేయించాలి. బాదంపప్పు వేగిన తరువాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో ఒక కప్పు ఫూల్ మఖానా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.ఇక ఆ తరువాత అర కప్పు పుట్నాలపప్పును వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే  8 ఎండు ఖర్జూరాలను ముక్కలుగా చేసి వాటిని వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా చల్లారిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో ఒక టేబుల్ స్పూన్ ఎండిన అల్లం పొడి ఇంకా ఒక టీ స్పూన్ వాము వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక ఇలా తయారు చేసిన పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఈ పొడిని రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని పాలల్లో వేసి కలిపి తీసుకోవాలి. ఇక ఈ పాలను రాత్రి పడుకోవడానికి అర గంట ముందు లేదా ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఈ విధంగా పొడిని తయారు చేసి తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం తగ్గడంతో పాటు అది భవిష్యత్తుల్లో రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: