బంగాళాదుంప తొక్క ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..?

మనం మాములుగా బంగాళాదుంపని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. బంగాళదుంప చిప్స్ మాత్రం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ బంగాళాదుంప తొక్కలని మాత్రం బయట పడేస్తాం. అయితే ఈ తొక్కలు ఆరోగ్యానికి చాలా మంచివి. బంగాళదుంప తొక్కలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కకి అనేక వ్యాధులతో పోరాడే శక్తి కూడా  ఉంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం సహాయంతో రక్తపోటును నియంత్రిస్తూ బంగాళాదుంప తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పై తొక్కలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.బంగాళాదుంప తొక్కలో కాల్షియం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, కాబట్టి ఇది సహజంగా ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఎముకలను దృఢపరుస్తుంది. ఆలు పై తొక్కలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, ఫినాలిక్ , యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై నల్ల మచ్చలను తొలగిస్తాయి.


ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఇంకా క్లోరోజెనిక్ యాసిడ్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. బంగాళాదుంపలు పొటాషియం అద్భుతమైన మూలం. మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బంగాళదుంప తొక్క తినడం మంచిది. అంతేకాకుండా, బంగాళాదుంప తొక్కలలో విటమిన్ B3 లోపం ఉండదు.ఈ బంగాళాదుంప తొక్క క్యాన్సర్ వంటి ప్రమాదాల నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. బంగాళాదుంప పీల్స్‌లో విటమిన్లు బి, సి, కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి.బంగాళదుంప తొక్కలో హైపర్‌గ్లైసీమిక్, కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి. బంగాళదుంప తొక్కలను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఇందులోని పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా బంగాళాదుంప తొక్కని కూడా తినండి. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: