కర్బూజా పండు తియ్యగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగో తెలుసా? ఈ విధంగా ట్రై చేయండి? కర్బూజా ను వాసన చూడండి. కాడ దగ్గర తీపి వాసన వస్తే అది పండింది తీపిగా ఉన్నట్లు. పసుపు లేదా బంగారు రంగులో ఉన్న ఖర్బూజా తీపిగా ఉంటుంది. పచ్చగా ఉంటే అది పిచ్చిది కావచ్చు. ట్యాప్ చేసినప్పుడు ధప్ థప్ శబ్దం వస్తే లోపల జ్యూస్ నిండిన తీపి కర్బూజా అని అర్థం. ఈ విధంగా ట్రై చేయడం వల్ల కర్బూజా తియ్యగా ఉంటుందో లేదో చూడవచ్చు. కర్బుజాను నొక్కినప్పుడు మెత్తగా ఉంటే అది బాగా పండింది తీపిగా కూడా ఉంటుంది.
తొక్క మీద మందమైనా, నష్టమైన గీతలు ఉన్న కర్బూజా తీపిగా ఉంటుంది. కర్బూజాను ఎత్తి చూడండి. పరిమాణానికి తగ్గ బరువు ఉంటే అందులో బీన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే తిపి కూడా ఉంటుంది. కాబట్టి కర్బూజా పండుని తప్పకుండా తీసుకోవడం మంచిది. కర్బుజాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కర్బూజా లో పొటాషియం చాలా ఎక్కువ. ఇది రక్తపోటును నియంతరిస్తుంది. ఉండే పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇవి తినడం చాలా మంచిది. కర్బూజా పండులో బి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బి6, నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. మెదడుకు సంతోషాన్ని కలిగించే సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. కర్బూజా ను నేరుగా కట్ చేసి తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు. దీన్ని సలాడ్లో వేసుకోవచ్చు. లేదా స్మూతీస్లలో కలుపుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి