
ఈ మొత్తంలో 100 కోట్ల రూపాయల బిజినెస్ తెలుగు రాష్ట్రాల నుంచే జరిగింది. నైజాం ఏరియాలో మైత్రి నిర్మాతలు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభించడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. మెజారిటీ ఏరియాలలో అడ్వాన్స్ బేసిస్ పై నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పాజిటివ్ టాక్ ఈ సినిమాకు కీలకం కానుందని చెప్పవచ్చు.
సుదీర్ఘ కాలం పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో వాయిదా పడటం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే థియేట్రికల్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని ప్రచారం జరగడం కూడా ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ అయింది.
క్రిటిక్స్ నుంచి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రెండు వారాల పాటు వీరమల్లు దూకుడుకు బ్రేకులు వెయ్యలేము. ఈ సినిమా ఫలితం ఆధారంగా కింగ్డమ్ సినిమాకు బిజినెస్ జరగనుందని తెలుస్తోంది. పవన్ నుంచి సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్, విశ్లేషకులు భావిస్తున్నారు.