గుడ్డు అనేది పోషకాల పుట్ట అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి కాదు. చిన్నదైనా గుడ్డులో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని పరిశోధనలతో నిరూపితమైంది. గుడ్డులో కొలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు కణాల నిర్మాణానికి చాలా అవసరం. నరాల వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి సహాయపడుతుంది. మేధస్సు, దృష్టి, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే గుణం గుడ్డులో ఉంటుంది. ఒక గుడ్డులో సుమారు 6–7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల ఎదుగుదల, దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది.

వ్యాయామం చేసే వారికి, పిల్లల పెరుగుదల కోసం ఇది బలమైన ఆహారం. గుడ్డులో ఉండే ల్యూటిన్ మరియు జీక్సాన్థిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటిచూపు మెరుగుపరిచే పనితీరు చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మాక్యులర్ డిజెనరేషన్ నివారించవచ్చు. గుడ్డులో విటమిన్ D ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణను పెంచి ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు, అస్తిమజ్జ సంబంధిత సమస్యలకు కూడా సహాయపడుతుంది. గతంలో గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువ అని భయం ఉండేది. కానీ తాజా పరిశోధనల ప్రకారం, గుడ్డులో ఉన్న గుండెకు మేలు చేస్తుంది.

 కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంలో ఉంచడంలో గుడ్డు సహకరిస్తుంది. గుడ్డు తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు, ఎందుకంటే ఇది ప్రొటీన్‌తో నిండిన ఆహారం. ఇది రోజంతా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది, ఎక్కువ తినకుండా ఉండేలా చేస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్ A, B2, B12, బైటిన్ వంటి పోషకాలు చర్మానికి, జుట్టుకు ఆరోగ్యం ఇస్తాయి. జుట్టు రాలడం, పొడిబారడం తగ్గించేందుకు సహాయపడుతుంది. గుడ్డులో క్యాలొరీస్ తక్కువైనా, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. రోజుకు 1 గుడ్డు ఆరోగ్యంగా ఉన్నవారికి సరిగ్గా సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ కావచ్చు. డాక్టర్ సలహాతో మాత్రమే గుడ్డు మోతాదు పెంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: