
గతంలో పూజ హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. అంతకంటే ముందు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు . వాళ్ళు నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడమే అందుకు కారణం . అయితే ఆ తర్వాత పూజ హెగ్డే ఆ స్థానాన్ని తీసుకునింది . సోషల్ మీడియాలో నానారకాలుగా పూజా హెగ్డే పేరుని వైరల్ చేశారు ఆకతాయిలు. ఇప్పుడు పూజ హెగ్డే ఐరన్ లెగ్ స్థానాని కీర్తి సురేష్ తీసుకున్నింది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు .
కీర్తి సురేష్ మహానటిగా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో బిగ్ ఫ్లాప్స్ వేసుకుంది . పెళ్లి తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ని బాగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు రీసెంట్ గానే ఆమె ఒక ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది . అదే నిజమైతే మాత్రం కీర్తి సురేష్ కెరియర్ మొత్తం బొక్క బోర్ల పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇండస్ట్రీలో పూజ హెగ్డే తర్వాత ఐరన్ లెగ్ బ్యూటీ కీర్తి సురేష్ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పాపం కీర్తి సురేష్ ఈ ట్రోలింగ్ ని ఎలా తట్టుకుంటుందో ఏమో..??