సాధారణంగా మనం చూసినట్లయితే .. ఏ మాల్ కి వెళ్లినా.. ఏ షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళినా .. ఏ షాప్ కి వెళ్ళినా .. ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఆఫర్స్ అనేటివి ఎక్కువగా లాస్ట్ లో 9 అనేది కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం డీమార్ట్ అదే విధంగా పలు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆఫర్స్ 19 , 29, 39 , 99, 199,299,109, 1999 ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని ఈ విధంగా ఆఫర్స్ లో చివరగా 9 తో ఎండ్ చేస్తారు అని సందేహం ఎక్కువగా వచ్చి ఉండదు . ఇప్పుడు జనాలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ఆఫర్స్ ఎందుకు చివరలో 9 ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


చాలా ఆఫర్లు, ధరలు ₹49.99, ₹199, ₹299 ఇలానే ఉంటాయి. ఇది  కాస్త "సైకాలజికల్ ట్రిక్‌"తో డిజైన్‌ చేస్తారు మార్కేటింగ్ మ్యానేజర్స్. దీని వెనకున్న ఉన్న బిగ్ సీక్రెట్ ఇది . ఇది మార్కెటింగ్‌లో ఓ బలమైన స్ట్రాటజీ. దీని ద్వారా కస్టమర్ల మనస్సులో ధర తక్కువగా అనిపించేలా చేస్తారు. మనం సడెన్ గా ఆ ప్రైస్ బోర్డ్ చూస్తే చివరి లో 9 అనే కనిపిస్తుంది. కానీ దాని ముందు ఉన్న డిజిట్స్ పెద్దగా మన మైండ్ లో క్యాలికులేట్ అవ్వవు. ఉదాహరణగా: ₹300 అంటే మనకు పెద్ద మొత్తం అనిపిస్తుంది. కానీ ₹299 అంటే అది కాస్త తక్కువగా ఉంటుంది. అక్కడ తగ్గింది   1 రూపాయే. కాని అది మనకి బిగ్ ర్లీఫ్ అనిపిస్తుంది.

 

ఇదే ట్రిక్ సూపర్ మార్కేట్స్ అసలు ట్రిక్. మనం మొదటి నంబర్ ఆధారంగా  మనస్సులో తక్కువగా భావిస్తాం. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్. మన మెదడు ఆ సంఖ్యని చూసే తీరులో ఉంటుంది. ₹299 అనగానే మెదడు "ఇది రెండు వందలల్లోనే ఉంది" అని భావిస్తుంది. అయితే అక్కడ రేటు మాత్రం 300. ₹300 ఒక్క రూపాయ్ తక్కువుగా చేసి ఆఫర్ పెట్టిన్నట్లు చూపిస్తారు. పూర్తి సంఖ్య కంటే చిన్నదిగా కనిపించడం మార్కేటింగ్ లో మరో స్పెషాలిటి. ₹99 అనేది ₹100 కంటే తక్కువగా కనిపిస్తుంది. కస్టమర్‌కు ఇది "స్మార్ట్ డీల్" అని ఫీలింగ్ వస్తుంది. సేల్ లేదా ఆఫర్ అని జనాలల్లో అనిపించడానికి ఈ విధంగా  చివర్లో ".99" ఉన్న ధరలు ఆఫర్ ధరలా కనిపిస్తాయి. ఈ టెక్నిక్ బుక్‌ల నుంచి బిస్కెట్ ప్యాకెట్లు, మొబైల్స్ వరకు అన్నిటికి వర్తిస్తుంది. కస్టమర్ ల మైండ్‌ను ప్రభావితం చేసే  మెయిన్ ట్రిక్ ఇదే...!

మరింత సమాచారం తెలుసుకోండి: