బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్న  దీపికా పదుకొనే గతంలో ఎఫైర్స్ రూమర్స్ చాలానే వినిపించాయి.. ముఖ్యంగా విజయ్  మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా  గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టును ముందుండి మరి నడిపించేవారు. బ్యాంకులకు కట్టాల్సిన డబ్బుల కారణంగా ఈ కుటుంబం లండన్ కు వెళ్ళిపోయింది. ఈ ఏడాది IPL లో బెంగళూరు టీమ్  18 సంవత్సరాల తర్వాత టైటిల్ ని గెలవడంతో మళ్లీ సోషల్ మీడియాలో సిద్ధార్థ్ మాల్యా కుటుంబానికి సంబంధించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.


 సిద్ధార్థ్ మాల్యా, దీపికా మధ్య ఉండే రిలేషన్ గురించి ఒక చర్చ జరుగుతోంది. 2011లో వీరిద్దరి మధ్య ప్రేమ  ఉండేదని అయితే వీరిద్దరూ కొన్ని కారణాల చేత విడిపోయారని వినిపించాయి. అందుకు గల కారణాన్ని దీపికా పడుకొని ఇటీవలే వెల్లడించినట్లుగా వినిపిస్తున్నాయి..సిద్ధార్థ్ మాల్యా తో బ్రేకప్ కి కారణం తనతో కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న తర్వాత అతని నిజ రూపం బయటపడిందని కొన్ని సందర్భాలలో హోటల్ బిల్ కట్టకుండా పోవడం, అనవసరంగా కోప్పడ్డం అలా ఎన్నో మార్పులు వచ్చాయని అందుకే అతని నుంచి దూరంగా వచ్చేసానని తెలిపింది..



దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో  ప్రభాస్ నటించినలో కల్కి సినిమాలో నటించింది. ఈ సినిమా సీక్వెల్లో కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న AA 22 చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా కింగ్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా మొదట ఏమైనా హీరోయిన్గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇమే ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అలా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: