డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి....అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసా? అలాగే ఆమె గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారనే సంగతి తెలుసా? అంటే ఎంతమంది మాత్రం తెలుసని చెప్పగలరు...అసలు ఆమె ఏ శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ గిరిజనులకే పుష్పశ్రీ మంత్రి అనే సంగతి క్లారిటీ ఉండకపోచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కురుపాం నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీ...అతి చిన్న వయసులో బంపర్ ఆఫర్ కొట్టేశారు. జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేశారు.

డిప్యూటీ సీఎం అంటే హోదా తప్ప...దాని వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవనే చెప్పాలి. సరే గిరిజన మంత్రిగా పుష్పశ్రీ...రెండున్నర ఏళ్లలో ఎంత బాగా పనిచేశారు? అంటే చెప్పడం కష్టమే. కరోనా వల్ల చాలా సమయం అయిపోయింది. అలాగే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత సమయం పోయింది. సరే వ్యక్తిగత కారణాలు అనేది అందరికీ మామూలే...అది వదిలేస్తే మిగిలిన సమయంలో మంత్రిగా ఎంత బాగా మెప్పించారు? అంటే అసలు మంత్రి అనే సంగతే జనాలకు పెద్దగా తెలియనప్పుడు...ఇంకా చెప్పడానికి ఏం ఉండదనే చెప్పొచ్చు.

అయితే పుష్పశ్రీ టిక్‌టాక్ మంత్రిగా బాగానే పేరు తెచ్చుకున్నారు. టిక్‌టాక్‌లో జగన్‌పై వీడియోలు తీసి బాగానే ఫేమస్ అయ్యారు. ఇక అంతే తప్ప శాఖా పరంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం. గిరిజన శాఖ మంత్రిగా ఉంటే గిరిజనుల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడం లాంటి కార్యక్రమాలు పెద్దగా జరగలేదనే చెప్పొచ్చు. ఇక అప్పుడప్పుడు జరిగే క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళడం..శాఖా పరమైన ఫైళ్ళ మీద సంతకాలు చేయడం లాంటివి చేశారని చెప్పొచ్చు. అంటే మంత్రిగా పుష్పశ్రీ పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఎమ్మెల్యేగా కురుపాం ప్రజలకు అండగా ఉండటంలో కూడా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. గిరిజనులు ఎక్కువగా ఉండే కురుపాంలో అభివృద్ధి తక్కువే...కాకపోతే ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు మామూలే. రాజకీయంగా పుష్పశ్రీ డౌన్ అవుతున్నారని తెలుస్తోంది. అదే టీడీపీకి ప్లస్. కానీ ఇక్కడి ప్రజలకు జగన్ అంటే అభిమానం ఎక్కువ...దాని బట్టి చూసుకుంటే కురుపాంలో పుష్పశ్రీకి ప్లస్ ఉంది...ఇంకా మిగిలినది ఎలా ఉందో చెప్పవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: