తెలంగాణ కాంగ్రెస్‌లో reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత శక్తివంతమైన నేత అనేది చెప్పాల్సిన పని లేదు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఉత్తమ్..దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు..ఇక ఆయన భార్య పద్మావతి రెడ్డి సైతం...ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. అయితే అంతటి బలవంతమైన ఫ్యామిలీకి టీడీపీ నుంచి ఎదుగుతూ వచ్చిన ఓ నాయకుడు చెక్ పెట్టేశారు. అయితే అది కూడా టీఆర్ఎస్‌లో చేరి...ఉత్తమ్ ఫ్యామిలీకి చెక్ పెట్టారు. ఉత్తమ్ ఫ్యామిలీ బలంగా ఉన్న కోదాడ నియోజకవర్గంలో మల్లయ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.


మామూలుగా కోదాడ నియోజకవర్గం ఆంధ్రా బోర్డర్‌లో ఉంటుంది..ఇక్కడ ఏపీ ప్రభావం ఎక్కువ. అందుకే ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. నాలుగుసార్లు టీడీపీ గెలవగా, మూడుసార్లు కాంగ్రెస్ గెలిచింది. 1999, 2004 ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టి కాంగ్రెస్ తరుపున reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2009లో ఆయన హుజూర్‌నగర్‌కు వెళ్ళి గెలవగా, ఆ ఎన్నికల్లో కోదాడలో టీడీపీ గెలిచింది. రాష్ట్రం విడిపోయాక అంటే...తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి విజయం సాధించారు.

2018 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తులో పోటీ చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరుపున పద్మావతి పోటీ చేశారు. కానీ టీడీపీకి సీటు దక్కకపోవడంతో బొల్లం మల్లయ్య యాదవ్...టీఆర్ఎస్‌లో చేరి కోదాడ టిక్కెట్ దక్కించుకుని, స్వల్ప మెజారిటీ తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన మల్లయ్య...తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసుకుంటూ..ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. హైవేకు పక్కనే ఉండటంతో కోదాడ పట్టణం శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. కోదాడ పట్టణం వ్యాపారంగా పరంగా, విద్యా సంస్థల పరంగా, వ్యవసాయ మార్కెట్ పరంగా ఇలా అన్నీ రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే కోదాడ బస్టాప్ కాలానికి అనుగుణంగా మాత్రం అభివృద్ధి చెందడం లేదు. అలాగే రూరల్ ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం ఇంకా మెరుగుపడాలి...స్వచ్చమైన మంచినీరు ప్రజలకు అందివ్వాలి.

రాజకీయంగా చూస్తే...మల్లయ్య ఇంకాస్త బలపడ్డారు గానీ...కోదాడలో ఉత్తమ్ ఫ్యామిలీ బలం మాత్రం తగ్గలేదు. అక్కడి ప్రజలు ఇంకా ఉత్తమ్ ఫ్యామిలీ వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ఉత్తమ్ ఫ్యామిలీకి నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి. వారు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. దీనికి తోడు గత ఎన్నికల్లో పద్మావతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సానుభూతి ఉంది. అటు టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ సారి మల్లయ్యకు మాత్రం ఉత్తమ్ ఫ్యామిలీ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs