మళియాల ఇండస్ట్రీకి చెందిన నటి భావన పై ఆమె కారు డ్రైవర్ పథకం ప్రకారం కిడ్నాప్ చేసి తన స్నేహితులతో కలిసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసందే.  అయితే ఈ విషయంపై భావన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది.  ఆమెకు అన్ని ఇండస్ట్రీల వర్గాల నుంచి మంచి సపోర్ట్ లభించింది.  దీంతో పోలీసులపై వత్తిడి పెరిగి ఆ నింధుతులను అరెస్టు చేసి కట కటాల పాలు చేసింది.  మొత్తానికి భావన చూపించిన తెగువకు యావత్ భారత దేశం ఆమెను ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు.  దీంతో చాలా మంది హీరోయిన్లు గతంలో తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.  
Image result for bhavana rape attempt
ఇప్పటికే రెజినా, వరలక్ష్మి, కాజల్ లాంటి కొంత మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ట్విట్టర్ లో చెప్పి బాధపడ్డారు.  సినిమాల్లో వేషం కావాలంటే కొంద మంది దర్శక, నిర్మాతలు తమను పడకగది సుఖం ఇవ్వమని అడిగినట్టు వారు తెలిపారు.  అయితే దీనిపై కొంత మంది పాజిటీవ్ గా రియాక్ట్ అయితే..కొంత మంది నెగిటీవ్ గా రియాక్ట్ అయ్యారు.  తాజాగా హాట్ భామ రాయ్ లక్ష్మీ ఈ విషయంపై నోరు విప్పింది.
Related image
కొందరు ఫిలిం మేకర్స్ ని ఆఫర్స్ ఇవ్వమని అడిగితే, లైంగిక సుఖాలు కావాలని ఇబ్బంది పెడతున్నట్టు రాయ్ లక్ష్మీ నిర్మొహమాటంగా చెప్పింది. ఈ సంప్రదాయం ఎప్పటి నుండో నడుస్తుందన్న ఆమె, తనకెప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని పేర్కొంది.  నలుగురికి నవ్వులు పంచేందుకు ఇండస్ట్రీకి వస్తే , కొందరు ఫిలిం మేకర్స్ ఇలాంటి దుర్మార్గపు రాచ క్రీడలతో అమ్మాయిలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అంటూ కొందరు మండి పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: