తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా నిలిచే నటుడు శింబు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లిటిల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శింబు తర్వాత హీరోగా మారారు.  తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన శింబు ప్రతిసారో ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం కామన్.  ఒకప్పుడు తెలుగు లోొ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమసాగరం’ దర్శకుడు టి. రాజేంద‌ర్ కుమారుడైన శింబు ‘అన్బనవన్ అసరధవన్ అదంగధవన్’ (ఏఏఏ)’షూటింగ్ కు సరిగ్గా హాజరుకాలేదని ఆఖరికి డబ్బింగ్ కూడా బాత్రూంలో నుంచి చెప్పి పంపాడని నిర్మాత మైకేల్ రాయప్పన్ గతంలో ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 

Image result for shimbu

ఆ తర్వాత అరాసన్ చిత్రంలో నటించేందుకు అడ్వాన్స్ తీసుకున్న శింబు ....ఆ సినిమాలో నటించకపోగా డబ్బులు తిరిగివ్వలేదని మరో నిర్మాత కోర్టుకెక్కారు. అరాస‌న్ చిత్రంలో నటించేందుకు 2013 జూన్ 17న శింబు..నిర్మాత నుండి 50 ల‌క్ష‌లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడ‌ని ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ ఆరోపించింది.అయితే షూటింగ్ అని చెప్పగానే ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకునేవాడని..సరిగా షూటింగ్ హాజరు కాకపోవడం తాము ఎంతగానో నష్టపోయానని చిత్ర యూనిట్ అంటుంది. 

Image result for madras high court

దాంతో తమ వద్ద తీసుకున్న డబ్బు వాపస్ ఇవ్వమని అడిగినా కూడా దానికి సరైన సమాధానం లేదని అంటున్నారు.  ఈ క్ర‌మంలో మ‌ద్రాస్ హైకోర్ట్‌ని ఆశ్ర‌యించారు. ఇలా చేసినందుకు శింబుపై మండి ప‌డ్డ మ‌ద్రాస్ హైకోర్టు అడ్వాన్స్‌ని వ‌డ్డీతో స‌హౄ చెల్లించాల‌ని ఆదేశించింది. ఒకవేళ శింబు డబ్బు చెల్లించని పక్షంలో ఇల్లు - ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.  మరి ఈ తీర్పుపై కాంట్రవర్సీ హీరో ఎలా స్పందిస్తాడో వేచి చూాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: