భారతీయ సినిమా చరిత్రలో ఒక సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకున్న సందర్భం ఏదైనా ఉందంటే అది బాహుబలి సినిమా గురించే. ఈ సినిమాతో మన దేశ సినిమా గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. ఒక తెలుగు సినిమాగా మొదలై భారతీయ సినిమాగా ఎదిగిన ఘనత బాహుబలిది. మన తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రాన నిలబెట్టిన ఘనత బాహుబలిది. 


బాలీవుడ్ జనాలు ఊహించలేనటువంటి బడ్జెట్ తో సినిమా రూపొందించి, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనంతటికి మూల కారణం రాజమౌళి. సినిమాని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలో బాగా తెలిసిన దర్శకుడు. సినిమాలు బాగా తీయడమే కాదు, బాగా డబ్బులు వచ్చేలా తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. బాహుబలి తర్వాత చాలా సినిమాలు బాహుబలిని బీట్ చేద్దామని ప్రయత్నించాయి. కానీ ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేవు.


ముఖ్యంగా హిందీలో వచ్చిన బాజీరావ్ మస్తానీ, పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి చిత్రాలు వచ్చినప్పటికీ వాటికి అంత ఆదరణ దక్కలేదు.  ఇప్పుడు కూడా బాహుబలి ని బీట్ చేద్దామనే లక్ష్యంతో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో "పానిపట్" అనే సినిమా వస్తుంది.  అయితే ఈ సినిమా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదా అని చూస్తే, ముందుగా అశుతోష్ గోవారికర్ సినిమాలన్నీ మాస్ జనాలకి నచ్చే విధంగా ఉండవు. సినిమా గురించి తెలిసిన వాళ్లకో, లేదా మేధావులకి నచ్చేలా ఉంటాయి


కానీ రాజమౌళి సినిమాలు ఏ సెంటర్ నుండి సి సెంటర్ వరకు అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా హీరో ఎలివేట్ సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్ సీన్లతో ప్రతీ ప్రేక్షకుడు ఉద్విగ్నతకి లోనయ్యేలా ఉంటాయి. అందుకే రాజమౌళి సినిమాకి అన్ని కలెక్షన్లు వస్తాయి. బాహుబలిని మించిన సినిమా అలాంటి మాస్ ప్రేక్షకులకు చేరువ చేసేలా ఉండాలని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: