టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్ హీరోగా, శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా తెరకెక్కిన కొత్తబంగారులోకం అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల, ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో ఆయన తీసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మంచి హిట్ కొట్టడంతో టాలీవుడ్ దృష్టి శ్రీకాంత్ పై పడింది. దానితో మెగా బ్రదర్ నాగబాబు, తన తనయుడు వరుణ్ తేజ్ డెబ్యూ మూవిని శ్రీకాంత్ కు అప్పగించారు. ఆ విధంగా వరుణ్ ఫస్ట్ మూవీ ముకుందను శ్రీకాంత్ తెరకెక్కించడం జరిగింది. అయితే ఆ సినిమా మాత్రం ఘోరంగా పరాజయం పాలయింది. దానితో రెండేళ్లు గ్యాప్ రావడంతో ఆపై సూపర్ స్టార్ మహేష్

 

శ్రీమంతుడు తరువాత తన తదుపరి సినిమా అవకాశం శ్రీకాంత్ కు ఇచ్చారు. అయితే అంత గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైన శ్రీకాంత్, ఆ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. దానితో ఆయన కెరీర్ ఆల్మోస్ట్ డైలమాలో పడింది. ఇక మళ్ళి నాలుగేళ్ళ గ్యాప్ తరువాత ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం శ్రీకాంత్ కు దక్కింది. అయితే ఇప్పుడు ఇదే విషయమై కొందరు వెంకీ ఫ్యాన్స్, శ్రీకాంత్ పై భయంతో పలువిధాలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. మా హీరో సినిమా కూడా బ్రహ్మోత్సవం మాదిరిగా తీయవు కదా బ్రదర్ అని కొందరు అంటుంటే, మీ దగ్గర మంచి విషయం ఉంది, కాకపోతే బ్రహ్మోత్సవంతో మీరు దెబ్బ తిన్నారు, 

 

కానీ ఈ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి రావాలని ఆసిస్తూ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే వారు భయపడుతున్నట్లు ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం చాలా వరకు లేదని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ అక్కడ ఎంత పెద్ద విజయాన్నిఅందుకుందో తెలిసిందే. ఇక దానికి రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప తప్పకుండా ఇటు తెలుగులో కూడా మంచి విజయం సాదిస్తుందని, కథా బలంతో పాటు మంచి ఎమోషన్స్ తో సాగె ఈ తరహా సినిమాలు తెలుగులో ఇదివరకు ఎన్నో విజయం సాధించాయని, ఆ విధంగానే ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు. మరి ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్ కు ఎంత మేర హెల్ప్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: