కృష్ణ భగవాన్... కాస్త హాస్య చతురత ఉండి, చిన్న డైలాగులను కూడా గ్రహించే సామర్ధ్యం ఉంటే చాలు అలాంటి వాళ్ళకు కృష్ణ భగవాన్ కామెడి ఒక రేంజ్ లో నచ్చుతుంది. అతని కామెడి సన్నివేశాలకు అన్ని వయసుల ముగ్దులు అయిపోతారు. ఆయన మాటలో ఉండే వెటకారం కామెడికి హైలెట్ గా నిలుస్తుంది. చిన్న సన్నివేశాన్ని కూడా ఆయన మలిచే తీరు నవ్వులు పూయిస్తుంది. ఇలాంటి వ్యక్తి పక్కన ఉంటే చాలు మంచి సరదాగా ఉంటుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆయన కామెడిని పెద్ద వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. 

 

30 ఏళ్ళు దాటిన వాళ్లకు ఆయన మాటలు బాగా నచ్చేవి. కబడ్డీ కబడ్డీ సినిమాలో జీవా తో ఆయన చేసిన కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో అసలు కృష్ణ భగవాన్ కామెడి మినహా ఏమీ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు ఇచ్చే వ్యక్తిగా ఆయన నటన ఎంతో ఆకట్టుకుంది. ఆయన ఉన్న పళంగా మాట్లాడే మాటలు మంచి కామెడిని పంచేవి. ఆయనకంటూ ప్రత్యేకంగా మాటలు రాసుకునే పని కూడా అప్పట్లో ఉండేది కాదట. అయితే ఆయన తన నోటి దూలతోనే అవకాశాలను పోగొట్టుకున్నారని కొందరు అంటూ ఉంటారు. 

 

టాలీవుడ్ లో సునీల్ తర్వాత అదే స్థాయిలో కామెడి పంచకపోయినా తన మాటలతో ఆకట్టుకునే వాళ్ళు. ఆ మాటలు సినిమా చూసిన తర్వాత కూడా గుర్తుకు వచ్చేవి. మరి ఏమైందో ఏమో తెలియదు ఉన్నపళంగా వెళ్ళిపోయారు. కొందరు అగ్ర దర్శకులను ఆయన కామెంట్ చేయడమే దీనికి కారణమని కూడా అన్నారు అప్పట్లో. అలాగే టాలీవుడ్ పెద్దలతో పాటుగా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొన్ని అసభ్యకరమైన మాటలతో ఆయన ఇబ్బంది పెట్టారని, అందుకే చాలా మంది దర్శకులు ఆయన్ను పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: