
మెగాస్టార్ చిరంజీవి.... ఈ పేరు గురించి దేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆయన పని చేసిన సినిమాలు ఒక సైడ్ అయితే కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అయితే ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కొద్ది రోజులకు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని తను మళ్ళీ సినిమా రంగం వైపు అడుగు పెట్టాడు.
#MegastarChiranjeevi బాగా ఇష్టపడి చేయాలనుకున్న రీమేక్ 'లూసిఫర్'
— TeluguBulletin.com (@TeluguBulletin) April 22, 2020
కానీ డైరెక్టర్ ఎవరనేది చాలా రోజులు వెంటాడిన ప్రశ్న?
మెగాస్టార్ కి ఆ బాధ తీర్చేశాడు మన #Prabhas
అందుకే ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీకి కూడా హీ ఈజ్ #డార్లింగ్#DecadeForClassicDarling @Chiru_FC @Team_Prabhas #Darling pic.twitter.com/KUeC1d1LbV
ఇక రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 తో వచ్చాడు. ఆ తర్వాత స్వాతంత్ర నేపథ్యంలో సాగె సైరా సినిమాతో ముందుకి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే... ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ రద్దు చేసుకోవడంతో ఆయన ఇంట్లోనే ఉంటూ సినీ రంగం సంబంధించిన వారికి " సి సి సి " గ్రూపు ద్వారా సేవలను అందిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆచార్య సినిమా తర్వాత మలయాళంలో తెరకెక్కిన లూసిఫెర్ తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ విషయంపై ఏ డైరెక్టర్ ని పెట్టుకుని సినిమా తీయాలని అర్థంకాక సతమతమవుతున్నాడు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే మన టాలీవుడ్ డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్ దీనికి ఒక పరిష్కారాన్ని చూపాడు. అదేమిటంటే చిరంజీవి బాగా ఇష్టపడి చేయాలనుకున్న రీమేక్ సినిమా లూసిఫర్ ఈ సినిమాని రీమేక్ చేయడానికి చిరంజీవి ప్రభాస్ పేరుని దర్శకుడు నాగ్ అశ్విన్ కి తెలపగా, హీరో ప్రభాస్ ఆ కథని డైరెక్టర్ సుజిత్ కి పంపగా సుజిత్ ఆ స్క్రిప్టుని డెవలప్ చేసి ఇవ్వగా దాన్ని రామ్ చరణ్ కి వినిపించగా చిరు 153 సినిమాగా దాన్ని తెరకెక్కించడానికి ఓకే చేశారు. ఏది ఏమైనా లూసిఫర్ సినిమాకి హీరో ప్రభాస్ పరిష్కారాన్ని చూపడాన్ని చెప్పవచ్చు.