త్రిష, శింబు పెళ్లివార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ పెళ్లి వీళ్లకు కొత్తేమీ కాదు. ఐదేళ్ల క్రితం ఓ బిజినెస్ మేన్ తో త్రిష ప్రేమ ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లింది. మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత రానాతో గాసిప్ గానే మిగిలిపోయింది. బిజినెస్ మేన్ తో బ్రేకప్ తర్వాత గత ఐదేళ్లుగా ప్రేమ.. దోమ జోలికి వెళ్లకుండా... వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. మరి శింబు ప్రేమకు ఎప్పుడు దగ్గరైందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు తమిళ తంబీలు. 

 

ప్రేమలో పడటం. లేవడం కూడా శింబుకు అలవాటే. నయనతారతో ప్రేమ వార్తలకే పరిమితమైంది. ఆ తర్వాత హన్సికతో ప్రేమ పెళ్లికి ముహూర్తం పెట్టుకునేవరకు వెళ్లింది. మళ్లీ మనస్పర్థలతో హన్సికకు కూడా దూరమయ్యాడు శింబు. 

 

త్రిష, శింబు జీవితాల్లో ప్రేమ.. డేటింగ్..బ్రేకప్ ఓ భాగమైపోయింది. ప్రేమలో మునిగి ఈది..చివరకు వడ్డుకు చేరుకున్నారు. వడ్డును కూడా వదిలిపెట్టకుండా అక్కడే ఇద్దరూ లవ్ లో పడి తమిళ తంబీలకు షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్న వార్త.. మీడియాలో హల్ చల్ చేస్తున్నా వీళ్లకు పట్టడం లేదు. ఈ వార్త గాసిప్పేనని సోషల్ మీడియా వేదికగా ఖండించలేదు. అంటే.. ఈ లవ్ న్యూస్ లో నిజముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

త్రిష, శింబు మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందో చెప్పడం కష్టమే అయినా.. 17ఏళ్ల క్రితం 2003లో అలియా అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత 2010లో విన్నయ్ తాండి వరువాయలో మరోసారి జతకట్టారు. త్రిష ఆ తర్వాతే బిజినెస్ మేన్ ను ప్రేమించింది కాబట్టి.. ఈ ఇద్దరి ప్రేమకు సినిమాలే క్లాప్ కొట్టాయని చెప్పలేం. 

 

త్రిష, శింబు కలిసి నటించిన విన్నయ్ తాండి వరువాయ మూవీకి గౌతమ్ మీనన్ దర్శకుడు. ఇదే సినిమాను తెలుగులో నాగచైతన్య, సమంతతో తీశాడు గౌతమ్. ముందుగా తెలుగు హీరో హీరోయన్లు ప్రేమలో పడగా.. త్రిష, శింబు కూడా ఇదే దారిలో వెళ్లడం విశేషం. మొత్తానికి ఇక్కడ సమంత, నాగచైతన్యను.. అక్కడ త్రిష.. శింబును మాయ చేసేశారన్న మాట. 

 


త్రిష ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోంది. శింబు చేతిలో రెండు సినిమాలున్నాయి. పెళ్లి వార్త నిజమే అయితే.. ఇవన్నీ పూర్తయితే గానీ.. ఏడడుగులు వేయరు. ప్రేమించుకుంటున్నాం.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటున్నామని చెబితే. అది ఫ్యాన్స్ కు క్వశ్చన్ మార్కే అవుతుంది. గతంలో పెళ్లి దాకా వెళ్లి యూటర్న్ తీసుకుంది. గ్యాప్ లో మనసులు మారి బ్రేకప్ కావచ్చన్న భయం అభిమానుల్లో లేకపోలేదు. మరి మీడియాలో వస్తున్న పెళ్లి గోలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: