బిగ్ బీ ఫ్యామిలీలో అందర్నీ కరోనా చుట్టేసింది. అమితాబ్ భార్య జయా బచ్చన్ మినహా.. అందరూ కరోనా బారిన పడ్డారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య.. అందరికీ పాజిటివ్ వచ్చింది. అయితే తాజాగా కుమార్తె ఆరాధ్యతో కలసి ఐశ్వర్య రాయ్ కరోనాని జయించి ఇంటికి తిరిగి చేరుకున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. 46ఏళ్ల ఐశ్వర్య, ఎనిమిదేళ్ల కూతురు ఆరాధ్యతో కలసి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. వారిద్దరికీ తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ గా వచ్చిందని అభిషేక్ వెల్లడించారు. 

 

అంతా బాగానే ఉంది మరి అభిషేక్ బచ్చన్ సంగతేంటి? భార్య నెగెటివ్ తో బైటపడితే అభిషేక్ ఎందుకింకా కరోనాతో పోరాడుతున్నారు. అమితాబ్ బచ్చన్ కి వయసు సహకరించడంలేదనుకుందాం, ఇంకొన్నిరోజులుంటే ఆరోగ్యం మరింత మెరుగవుతుందనే ఉద్దేశంతో వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారనుకుందాం. అభిషేక్ బచ్చన్ కి ఏమయింది, అతనికి ఇతర అనారోగ్యాలేవీ లేవు కదా. మరి ఐశ్వర్యతో కలసి అభిషేక్ ఎందుకు డిశ్చార్జి కాలేదనే ప్రశ్ని ఇప్పుడు సోషల్ మీడియాని చుట్టేస్తోంది. తండ్రీ కొడుకులు ఆస్పత్రిలో ఉండగా.. కోడలు, మనవరాలికి ముందే నయం కావడం సంతోషాన్ని కలిగించినా. బిగ్ బి, స్మాల్ బి.. ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. వారికి కూడా కరోనా టెస్ట్ తిరిగి చేశారా? మరి వారికి మళ్లీ పాజిటివ్ వచ్చిందా అనే విషయాలను అభిషేక్ స్పష్టం చేయడంలేదు. 

 

వాస్తవానికి బచ్చన్ ఫ్యామిలీలో ముందుగా అమితాబ్ కరోనా బారిన పడ్డారు, ఆయనతోపాటు కొడుకు అభిషేక్ కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. అయితే వారిద్దరిలో కొవిడ్ లక్షణాలేవీ లేకపోవడంతో హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత కాస్త నలతగా ఉండటంతో ఎందుకైనా మంచిదని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లీ కూతుళ్లు వెంటనే కోలుకున్నారు. ఇద్దరూ అసింప్టమాటిక్ కావడంతో వెంటనే కోరుకున్నారు. తాజా పరీక్షల్లో వారికి నెగెటివ్ వచ్చింది. అయితే అమితాబ్, అభిషేక్ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. వారిద్దరికీ కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయట. ఇద్దరూ సింప్టమాటిక్ కేసులు కావడంతో కోలుకోడానికి మరికొన్నిరోజులు టైమ్ పడుతుందని అంటున్నారు వైద్యులు. అందుకే తండ్రీ కొడుకుల కంటే ముందు ముందు ఐశ్వర్య , ఆరాధ్య.. డిశ్చార్జి అయ్యారు. అభిషేక్ లో లేని ఇమ్యూనిటీ పవర్ ఐశ్వర్యలో ఉండటం వల్లే బిడ్డతో సహా ఆమె ముందుగానే డిశ్చార్జి అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: