తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్న చిత్రాల జోరు పెరుగుతోంది. కథలో పట్టు ఉంటే ఆటోమేటిక్ గా సినిమా హిట్ అయిపోతుందనే ఫార్ములాను పట్టేసారు దర్శకులు. అలాంటి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. చిన్న చిన్న సినిమాలు ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి సినిమాలు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. అటువంటి చిత్రాల కోవకు చెందిందే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకట్ మహా దర్శకత్వం వహించారు.


 ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్రశంసలూ ఈ చిత్రం ద‌క్కించుకుంది. 'కేరాఫ్ కంచెరపాలెం' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు వెంకట్ మహా. ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అలాంటి దర్శకుడి నుంచి వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా అంతే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం  సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా పై ఇలా స్పందించారు.


‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య నా మ‌న‌సుకెంతో నచ్చింది. అద్భుత‌మైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌గారు, సుహాస్‌, హ‌రి చంద‌న‌, రూప త‌దిత‌రుల న‌ట‌న న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’ అని తెలుపుతూ ట్వీట్ చేశారు రామ్ చరణ్. ఇలా ఒక్కకరూ ఈ సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఆర్కా మీడియావ‌ర్క్స్‌, మ‌హాయాణ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి చందన హీరోయిన్ గా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: