తెలుగు చిత్ర పరిశ్రమలో లీడర్ చిత్రంతో పరిచయం అయిన ప్రియా ఆనంద్. రామ్ తో నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే ఈమె తమిళంలో మాత్రం మంచి ఫాలోయింగ్ ను కలిగి ఉంది. అక్కడ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈమెకు సినిమాలతో క్రేజ్ పెరగడంతో పాటు ఈమెపై పుకార్లు కూడా పట్టుకు వచ్చాయి. ఈమె మొదట యంగ్ హీరో అధర్వతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఆమె కొట్టి పారేసింది.


అంతేకాదు ప్రియా ఆనంద్ మూడేళ్ళ క్రితం ‘వామనన్‌’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైయింది‌. ఆ తర్వాత ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా మంచి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ అందాల భామ ప్రేమలో పడిందంటూ సోషల్‌ మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. అధర్వ ప్రేమ వార్తు కొట్టి పారేసిన కొన్ని రోజులకే మళ్లీ కార్తీక్ తనయుడు గౌతమ్ తో ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఆ తర్వాత నటుడు కార్తీక్‌ తనయుడు గౌతమ్‌తో ప్రియా ఆనంద్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



అంతేకాదు వారిద్దరితో ఉన్న ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యేవి. దాంతో ఈమె నిజంగానే వారిలో ఎవరితోనో ఒకరితో ప్రేమలో ఉందేమో అంటూ అంతా అనుకున్నారు. తాజాగా మరోసారి ఆ విషయమై ప్రియా ఆనంద్ స్పందించింది. తాను ఎవరితో ప్రేమలో లేను. గౌతమ్ మరియు అధర్వలు నాకు మంచి స్నేహితులు. మేము ముగ్గురం కూడా రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ అన్ని విషయాలను చర్చించుకుంటూ ఉంటామని ఆమె తెలిపింది. మరి ఇప్పుడైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడేనో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: