శృతిహాసన్ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటీమణి సారిక, నటుడు కమలహాసన్ కి కూతురైన శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేయగానే ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. అయితే ప్రస్తుత కాలంలో నెటోటిజం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శృతిహాసన్ తన గురించి తన బ్యాగ్రౌండ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.


'నా ఇంటిపేరుకి ఎంత విలువ ఉందో నాకు తెలుసు. ఆ ఇంటి పేరు కారణంగానే నేను సినిమా ఇండస్ట్రీలో అతి సులభంగా అరంగేట్రం చేయగలిగాను కానీ నేను ఇప్పటికీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని సామాన్యమైన నటీమణి గానే ఫీల్ అవుతాను. అన్నీ ఉన్నా కూడా నటనా ప్రతిభ అదృష్టం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం,' అని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.


ఇకపోతే శృతి హాసన్ ఎడ్జ్(Edge) అనే ఒక ప్రైవేట్ పాటని తానే రాసి తానే పాడి తానే కంపోజ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాట విడుదలై ప్రస్తుతం వారం రోజుల కావస్తుండగా ఇప్పటికే 12 లక్షల వ్యూస్ వచ్చాయి. 43వేల లైకులు వచ్చాయి. ఈ పాట వీడియో కింద శృతిహాసన్ చాలా ప్రతిభ గలవారని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని వందల మంది కామెంట్లు చేస్తున్నారు. నటీమణిగా భారత సినీ ప్రేక్షకులకు పరిచయమైన శృతిహాసన్ ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి పాటలను విడుదల చేస్తున్నారు.


తన పాటలకు బాగా ప్రేక్షకాదరణ లభిస్తే శృతిహాసన్ శాశ్వతంగా గాయకురాలు గానే  మిగిలిపోతారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోందని సమాచారం. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి వాళ్ళిద్దరి మధ్య స్క్రీన్ పై చోటుచేసుకునే రొమాన్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: