రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఆయనే హీరోగా గత మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి టాక్ తెచ్చుకుందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా మొదట కన్నడ భాషలో విడుదలై ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అలా మూడేళ్ల తర్వాత కాంతార సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ గూస్ బంప్స్ వస్తున్నాయి అని ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫైర్ ఎమోజిలు షేర్ చేస్తూ రిషబ్ శెట్టి నటనకి సలాం కొట్టాల్సిందే అంటూ ఇలా చాలామంది నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ గా దైవత్వాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని తెరకెక్కించారు కాబట్టి సినిమా అద్భుతంగా ఉండడమే కాదు అందరూ సినిమా చూసి పూనకాలు వస్తున్నాయి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అని చాలామంది ఊహించారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కాంతార చాప్టర్ వన్ మూవీ మొదటి షో తోనే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సినిమాలో ఉన్న ప్లస్ లు,మైనస్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 కాంతార:చాప్టర్ 1 ప్లస్.
 కాంతార మూవీ లాగే కాంతార:చాప్టర్ 1 లో కూడా రిషబ్ శెట్టి తన నటనతో ఆకట్టుకున్నారు.సినిమాకి పెద్ద ప్లస్ ఈయన నటనే అని చెప్పుకోవచ్చు. అలాగే రుక్మిణి వసంత్ గ్లామర్ రోల్ కూడా సినిమాకి కలిసి వచ్చింది. అంతేకాదు సినిమాలో తన యాక్టింగ్ తో కూడా మెప్పించింది. యువరాణిలా చాలా అందంగా ఉంది.అలాగే మిగిలిన తారాగణం యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమాకి అద్భుతమైన బీజీఎం ఇవ్వడంతో సినిమా చూసేవారికి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంట్రడక్షన్,ఇంటర్వెల్ బ్లాక్,క్లైమాక్స్ ఇవన్నీ కూడా అదిరిపోయాయి. అంతేకాదు విఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా ఉంది.ఇవన్నీ సినిమాకు పెద్ద ప్లస్.. ఇక మరో ప్లస్ ఏంటంటే దైవత్వం కాన్సెప్ట్ ఉండడంతో చాలామంది ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు.

 కాంతార:చాప్టర్ 1 మూవీ మైనస్:
 కాంతార చాప్టర్ 1 మూవీ కి పెద్ద మైనస్ ఏంటంటే మూవీ నరేషన్ కాస్త స్లోగా ఉండడమే. అలాగే సినిమా చూసేటప్పుడు కథ అర్థం చేసుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది.. ఇక పాటలు రొటీన్ గా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అయితే కొంతమంది నెటిజెన్లు రిషబ్ శెట్టి తన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు కానీ డైరెక్షన్ తో మెప్పించలేకపోయారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే కాంతార మూవీలో అన్ని సీన్స్ చాలా సహజసిద్ధంగా చూపించారు. కానీ కాంతార ప్రీక్వెల్ లో మాత్రం కాస్త భారీతనం చూపించడంతో ఈ సినిమాలో నేటివిటీ కాస్త మిస్సయింది అంటున్నారు.. ఇవి తప్ప సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: