యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ‘ఆహా’లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, అంతకన్నా ముందుగానే అంటే రేపు (అక్టోబ‌ర్ 1న) సాయంత్రం 6 గంట‌లకే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ వేడుకలో కమెడియన్ స‌ప్తగిరి మా‌ట్లాడుతూ.. ‘‘ఐదు నెలల డార్క్ డేస్‌ త‌ర్వాత ఈ స్టేజి మీద నిల‌బ‌డి మాట్లాడ‌డం చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌తో మిమ్మల్నంద‌రిని హిలేరియ‌స్‌గా న‌వ్వించ‌బోతున్నాం. బాస్ బామ్మర్ది అనే క్యారెక్టర్లో ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నాను. నేను, రాజ్‌త‌రుణ్‌, పోసాని, మాళ‌విక‌, న‌రేష్‌గారు చేసిన ఆ సీక్వెన్స్ మిమ్మల్ని క‌డుపుబ్బా న‌వ్వించి ప‌దే ప‌దే మాట్లాడుకునే విధంగా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజ‌య్ గారికి, రాధా మోహ‌న్‌గారికి ధ‌న్యవాదాలు’’ అని అన్నారు.


కొరియోగ్రాఫర్ శేఖ‌ర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఫంక్షన్స్ చూసి చాలా రోజులైంది. విజ‌య్ గారు డైరెక్ట్ చేసిన మూడు సినిమాల్లో అన్ని పాట‌లు నాతోనే కొరియోగ్రఫి చేయించారు. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్ గారికి, విజ‌య్ గారికి ఈ సంద‌ర్భంగా నా కృత‌జ్ఞత‌లు. ఆండ్రూ గారి ఫోటోగ్రఫీకి నాతో పాటు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ మంచి డ్యాన్సర్ అని మ‌రోసారి ప్రూవ్ చేసుకుంటాడు. అనూప్ అన్నీ మంచి ట్యూన్స్ ఇచ్చారు. మాళ‌విక చ‌క్కగా న‌టించింది’’ అని అన్నారు. ద‌ర్శకుడు విజ‌య్‌ కుమార్ కొండా మాట్లాడుతూ.. ‘‘మూడు సంవ‌త్సరాల క్రితం నేను నెక్ట్స్ ఏం సినిమా చేయాలి అని ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అంద‌రినీ న‌వ్వించే సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఒక పాయింట్‌గా స్టార్ట్ చేసి నా స్నేహితుడు నంద్యాల ర‌వితో క‌లిసి చాలా రోజులు ట్రావెల్ చేసి ఈ క‌థ రాశాను. మధ్యలో మ‌ధునంద‌న్, ప్రకాశ్ మాకు హెల్ప్ చేశారు. ఈ సినిమాలో డైలాగ్స్ ఇంత బాగున్నాయి అంటే దానికి కార‌ణం నంద్యాల ర‌వి పెట్టిన ఎఫ‌ర్ట్‌. ఈ క‌థ ఎవ‌రితో తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు రాజ్‌ త‌రుణ్ బెస్ట్ చాయిస్ అనిపించింది. త‌ర్వాత రాధా మోహ‌న్ గారిని క‌లిసి స‌ర్ సినిమాకు కొంచెం ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది అని చెప్పాను. ఆయ‌న క‌థ‌ను, నన్ను న‌మ్మి ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమాకు ఏది కావాలో అవ‌న్ని స‌మ‌కూర్చి మాకు హెల్ప్ చేశారు. సినిమాలో చాలా పెద్ద ప్యాడింగ్ ఉంటుంది. మేము థియేట‌ర్‌లో మీ న‌వ్వుల్నే మిస్ అవుతున్నాం కాని మీరు న‌వ్విన ప్రతిసారి మా మాట‌లు గుర్తొస్తాయి. డెఫినెట్‌గా ఆహాలో ఒక మంచి సినిమా అవుతుంది. మేము ఎంత నిజాయితీగా సినిమా చేశామో మీరు అంత నిజాయితీగా ఆహాలోనే సినిమా చూడండి. థ్యాంక్యూ’’ అని అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలల త‌ర్వాత ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒరేయ్ బుజ్జిగా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందించాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి స‌హ‌కారం ఉండాలి. అలా పూర్తిగా అంద‌రి స‌హ‌కారంతోనే ఈ సినిమా పూర్తిచేయ‌గ‌లిగాను. ద‌ర్శకుడు విజ‌య్ కుమార్ గారు స్టార్‌బ‌క్స్ కాఫీ హౌస్‌లో ఫ‌స్ట్ ఈ స్టోరీ నాకు చెప్పారు. త‌ను నంద్యాల ర‌వి కొన్ని సంవ‌త్సరాలు క‌ష్టప‌డి ఫ్లాలెస్‌గా ఒక స్క్రిప్ట్‌ని త‌యారు చేసి ఆ స్క్రిస్ట్‌ని న‌న్ను ప్రొడ్యూస్ చేయ‌మ‌ని అడిగారు. సినిమా చెయొచ్చు కాని ఆ స‌బ్జెక్ట్‌కి మంచి టీమ్ కుద‌రాలి అనుకున్నాను. అలా మంచి టీమ్‌, మంచి ప్యాడింగ్ కుదిరింది. అంద‌రు కష్టప‌డి ఒక మంచి సినిమాగా చేశారు. త‌ప్పకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఆహాని మ‌రోమెట్టు ఎక్కిస్తుంద‌ని మేము న‌మ్ముతున్నాము’’ అని అన్నారు. హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో ఇలాంటి ఒక ఈవెంట్ జ‌రుగుతుంద‌ని నేను ఊహించ‌లేదు. ముందుగా శేఖ‌ర్ మాస్టర్, విజ‌య్‌ ప‌ట్టుబ‌ట్టి నాతో ఈ సినిమాలో డ్యాన్స్ వేయించారు. అలాగే ఆండ్రూ గారు స్పీడ్‌, క్వాలిటీ రెండు ఒకేసారి ఎలా చేస్తారో నాకు తెలీదు. మ‌ధు యాక్టర్‌గానే కాకుండా స్క్రిప్ట్‌లో కూడా హెల్ప్ చేశారు. నంద్యాల ర‌వి గారు పేప‌ర్‌మీద పెన్ను పెడితే న‌వ్వులు పూస్తాయి. స‌ప్తగిరి గారు చాలా బాగా న‌టించారు. అనూప్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో మాళ‌వికని ఒక కొత్త కోణంలో చూస్తారు. చాలా బాగా న‌టించింది. ఈ సినిమా నాతో చేసినందుకు విజ‌య్‌గారికి థ్యాంక్స్‌. అయితే నా త‌ర‌పున ఆహా వారికి, ప్రొడ్యూస‌ర్‌ గారికి ఒక రిక్వస్ట్. నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. సినిమా బ‌జ్ చాలా బాగుంది.. సినిమాని ఒక‌రోజు ముందుగా మాకు చూపించండి అని అడుగుతున్నారు. వారంద‌రి కోసం సినిమాని ఒక‌రోజు ముందుగా ప్రీమియ‌ర్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. రాజ్ త‌రుణ్, ప్రేక్షకుల కోరిక మేర‌కు అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6 గంట‌ల‌ నుండి ఆహాలో ఒరేయ్ బుజ్జిగా అందుబాటులో ఉంటుంద‌ని నిర్మాత రాధా మోహ‌న్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: