నేడు అక్టోబర్ 10... అందాల భామ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హ్యాపీ బర్త్ డే రకుల్ అంటూ ఆమె లేటెస్ట్ మూవీ 'చెక్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్. ఈ పోస్టర్‌లో చాలా సీరియస్‌గా కనిపిస్తున్న రకుల్.. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. ఇది చూస్తుంటే ఈ మూవీలో రకుల్ క్యారెక్టర్‌ చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుందని తెలుస్తోంది.


ఇక ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై క్యూట్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ చెక్ మూవీ రూపొందుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీలుక్‌ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి వి. ఆనంద ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. ఇక ఈ సినిమాలో క్యూట్ స్టార్ నితిన్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, మళయాళీ ముద్దుగుమ్మ, కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించిన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతుందని చెపుతున్నారు చెక్ చిత్ర యూనిట్. మూలకథ విషయానికి వస్తే ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ కథ ఇది అని, ఇందులో హీరో నితిన్ అద్భుతమైన మెచ్యూర్డ్  నటనను ప్రేక్షకులు చూడబోతున్నారని చిత్ర యూనిట్ అంటోంది. అలాగే హీరోయిన్లకు కూడా నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతాయని, ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నెల అక్టోబర్ 12 నుంచి నెలాఖరు వరకు జరిగే చివరి షెడ్యూల్ పూర్తిచేసి అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: