మొత్తానికి ఎప్పటినుండో అభిమానులు కోరుతున్నట్లుగా వకీల్ సాబ్ సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దానితోపాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వకీల్ సాబ్ లో పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో వజ్రాల దొంగ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. కాగా వకీల్ సాబ్ ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, క్రిష్ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తన మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఒక సాంగ్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా యూనిట్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిష్ సినిమా కూడా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభించి దానిని కూడా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్న పవన్ ఆపై తన మిత్రుడైనటువంటి రామ్ తాళ్లూరి నిర్మాతగా  ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో కొనసాగిన సురేందర్ రెడ్డికి టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడిగా మంచి పేరున్న విషయం తెలిసిందే.

తన సినిమాలోని హీరోల డ్రెస్సింగ్ అలానే స్టైల్, క్యారెక్టర్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే సురేందర్ రెడ్డి పవర్ స్టార్ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించి ఏకంగా హాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ అదిరిపోతుందని ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు హాలీవుడ్ స్టైలిస్టు అయితేనే పక్కాగా డ్రెస్సులు డిజైన్ చేయగలరని భావించిన సురేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతైనా పవర్ స్టార్ రేంజ్ కి ఆ మాత్రం ఉండాలి కదా అని ఈ విషయమై పలువురు ప్రేక్షకులు, అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: