దీంతో ఈ భామకి వరుస షూట్ లు ఒకదాని వెనక ఒకటి వచ్చేస్తున్నాయి. దసరా అయిపోగానే ఇటలీ వెళ్ళిపోయిన ఈ భామ అక్కడ రాధేశ్యామ్ షూటింగ్ జరుపుకుని నవంబర్ మొదటి వారంలో ఇండియా తిరిగి వచ్చింది. వచ్చి రావడంతో దీపావళి కూడా జరుపుకోకుండానే సర్కస్ సినిమా షూటింగ్ కి హాజరైంది. అలా ప్యాకప్ చెప్పారో లేదో మరలా హైదరాబాద్ వచ్చి ఇక్కడ రాధేశ్యామ్ అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల షూటింగ్ లకు హాజరవుతోంది. ఈమె సల్మాన్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
కభీ ఈద్ కభీ దీపావళి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కూడా జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా మూడు సినిమాలని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన పూజకు మరో సినిమా యాడ్ కానున్నది. దీంతో ఆమె వీటన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్టు సినిమాలు ఒప్పుకోగానే సరిపోదు ఇప్పుడు వీటన్నిటినీ మేనేజ్ చేసుకోక తప్పదు కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.