మలైకా అరోరా..ఈ పేరు వింటే చాలు ఎక్కడలేని కోర్కెలు పుట్టుకొస్తాయి..అమ్మడి ఏజ్ కు ఆమె చేసే ఫోటోషూట్స్ కు ఏమాత్రం సంబంధం ఉండదు..ప్రస్తుతం 50 ఏజ్ కి దగ్గర్లో ఉన్నప్పటికీ..25 ఏళ్ల పడుచుఅమ్మాయిల తన ఫిజిక్ తో మాయ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హాట్ హాట్ ఫోటో షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేయడం అమ్మడి ప్రత్యేకం. ఈమె నుండి సరికొత్త ఫోటో షూట్ పిక్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా.. అని అంత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి ఫొటోస్ నే షేర్ చేసి సెగలు రేపుతోంది.

కెరియర్ మొదట్లో టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణించిన ఈమె..ఆ తర్వాత కొత్త భామల ఎంట్రీ తో ఐటెం సాంగ్స్ లకు షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన దిల్ సే సినిమాలో చయ్య.. చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి.. హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. తెలుగులోనూ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ లో కెవ్వు కేక అంటూ కేక పుట్టించింది. ఈ సాంగ్ లో అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ అభిమానులను సోషల్ మీడియా ద్వారా అలరిస్తుంటుంది. సోషల్ మీడియా పేజీలలో పరీతమైన ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న ఈమె..యోగ ఆసనాలతో అబ్బా అనిపిస్తుంటుంది. అంతెందుకు ఈమెకు ఇద్దరు పిల్లలంటే ఎవ్వరు కూడా నమ్మరు. ప్రస్తుతం ఈమె తన మొదటి భర్త ఆర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకొని,  అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుంది. త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందని బి టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈమెకు సంబదించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.             

మరింత సమాచారం తెలుసుకోండి: