కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తెలుగులో తొలిసారి తన సినిమాను ప్రమోషన్స్ చేసుకుని మరీ విడుదల చేసుకున్నాడు. ఈయన నటిచిన తాజా చిత్రం యువరత్న కన్నడంతో పటు తెలుగులోనూ ఏప్రిల్ 1న విడుద‌లైంది. కేజీయఫ్ లాంటి భారీ సినిమాను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. పునీత్ ఎవరో ఇక్కడ తెలియకపోయినా కూడా ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్.. ప్ర‌కాశ్ రాజ్‌, సాయికుమార్ లాంటి తెలిసిన న‌టీన‌టులు ఉన్నారు ఈ సినిమాలో.

నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుద‌ల చేశాడు. దీంతోపాటు మ‌రికొన్ని ఏరియాల్లో కూడా పెద్ద డిస్ట్రిబ్యూట‌ర్ల‌కే ఇచ్చారు. కానీ క‌లెక్ష్లన్స్ విష‌యంలో మాత్రం ప‌వ‌ర్ స్టార్ పాచిక పార‌లేదు. యువరత్న చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేజీయ‌ఫ్‌ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు వాళ్లే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆ రేంజ్ లో ఆడలేదు.ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.25 లక్షల షేర్ రాబట్టింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ లాంటి సినిమాలతో పోటీ పడటంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. అయితే ఇప్పుడు విడుదలైన 8 రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుంది. రేపటి నుంచి ఈ సినిమా అమెజాన్ స్ట్రీమ్ అవుతుంది.

కర్ణాటక కరోన వలన 50 శాతం సీటింగ్ ని పెట్టడంతో ఈ సినిమాని ఆడించడం కన్నా ప్రైమ్ లో విడుదల చేయడం మేలు అని నిర్మాతలు భావించారు. అయితే ఇంత పెద్ద కన్నడ స్టార్ హీరో మూవీ ఇలా సడెన్ గా ప్రైమ్ లో విడుదల చేయడంతో త్వరలో థియేటర్స్ లో విడుదల చేయబోయే సినిమా నిర్మాతలు ఓటిటి విడుదల గురించి ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: