బుట్ట బొమ్మ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ఎందుకంటే టాలీవుడ్ లోని వన్ అఫ్ ది బ్లాక్‌బస్టర్‌ సాంగ్స్ లో  'బుట్టబొమ్మ' సాంగ్ కూడా ఒకటి. ఈ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మన అందరికి తెలిసిందే. అల్లు అర్జున్, పూజా హేగ్జే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో సాంగ్ అది. ఈ సినిమాలోని ప్ర‌తి పాట సంగీత ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ముఖ్యంగా బుట్ట బొమ్మ  పాటలో అల్లు అర్జున్ నటన అమోఘం అని చెప్పాలి. అలాగే పూజా హేగ్జే అయితే నిజంగానే బుట్ట బొమ్మ లాగానే ఉంది. ఈ బుట్ట బొమ్మ పాట మీద ఎన్నో రకాల షార్ట్‌ వీడియోలు కూడా వచ్చాయి. కొన్ని రకాల షార్ట్ వీడియోల ద్వారా ఈ పాట  దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్‌ అయినది. 



ఇంకా యూ ట్యూబ్ లో ఈ పాట క్రెజ్ గురించి మాటల్లో చెప్పలేము.తాజాగా ఇప్పుడు ఈ బుట్ట బొమ్మ పాట యూ ట్యూబ్ లో మరొక సరి కొత్త రికార్డు సృష్టించింది. క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బుట్ట బొమ్మ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్‌ అయ్యాయి.ఈ పాట త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన పాట అని కూడా వార్నర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.యూట్యూబ్‌లో బుట్ట బొమ్మ పాటకు నాలుగు మిలియన్ల లైకులు వచ్చాయి.ఒక్క పాటకు ఇన్ని లైక్స్ రావడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.



యూ ట్యూబ్ లో నాలుగు మిలియన్ల లైక్స్ వచ్చిన తొలి తెలుగు పాటగా అలా వైకుంఠపురములో.. సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బుట్ట బొమ్మ పాట యూట్యూబ్‌లో అరవై కోట్లకు పైగా వ్యూస్‌ సాధించి ముందుకు దూసుకుని పోతోంది.ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌  సంగీతాన్ని అందించాడు. ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ పాడాడు. ఈ పాటకు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసారు. అల్లు అర్జున్ స్టెప్స్, పూజా హేగ్జే అందాలు బుట్ట బొమ్మ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: