మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాల్లో నటించారు. పునాదిరాళ్లు సినిమాతో మొదలైన చిరంజీవి సినీ ప్రయాణం సైరా నరసింహారెడ్డి వరకు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతోంది. ఈ 151 సినిమాల‌ లో చిరంజీవి ఎన్నో సినిమాలలో.. ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అతిలోక సుందరి శ్రీదేవి నుంచి లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి - రాధా - సరిత - రమ్యకృష్ణ - రంభ - రోజా - సిమ్రాన్ - తమన్నా - నయనతార - కాజల్ అగర్వాల్ - సోనాలి బింద్రే - ఆర్తి అగర్వాల్ - అంజలా జవేరి - సౌందర్య - మీనా - దివ్య‌భార‌తి ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందరితోనూ చేశారు. ఎంతో మంది హీరోయిన్లతో చిరంజీవి నటించినా ఎవ్వ‌రి విష‌యంలో అయినా చిరుదే డామినేష‌న్ గా ఉండేద‌ట‌.

ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవికి చెమటలు పట్టించేద‌ట‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి మేటి నటి రాధ. రాధాకు గ్రాస్పింగ్ ప‌వ‌ర్‌ చాలా ఎక్కువ అన్న‌ విషయాన్ని చిరంజీవి చెప్పారు. ఏదైనా ఒక సీన్ గురించి చెప్పినప్పుడు వెంటనే క్యాచ్‌ చేసి షాట్‌ షూటింగ్ కు రెడీ అయిపోయేదట. మిగిలిన హీరోయిన్ల విషయంలో మాత్రం చిరంజీవి ముందుగా షాట్ కోసం సెట్ లోకి వస్తే రాధ విషయంలో మాత్రం చిరంజీవి కాస్తంత ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని షాట్‌కు వచ్చేవార‌ట.

రాధ ఏ సీన్ ను అయినా అంత స్పీడ్‌గా ప‌ట్టేసేద‌ని రాఘ‌వేంద్ర రావు కూడా చెప్పారు. ఇక డ్యాన్సుల విష‌యంలో కూడా చిరుతో పోటీ ప‌డి మ‌రీ ఆమె చేసేద‌ట‌. ఏదేమైనా చిరంజీవికే చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. రాధా మామూలు హీరోయిన్ కాద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: