కొండవీటి రాజా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన  సినిమా  ఇది. దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా , విజయశాంతి, రాధ హీరోయిన్ లుగా నటించి, ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ఇది. అంతే కాదు ఇందులో ఒక ప్రత్యేకమైన పాటలో సిల్క్ స్మిత కూడా నటించడం జరిగింది. ఇక ఐటమ్ సాంగ్ లో సిల్క్ స్మిత, అనురాధ , జయమాలిని తో కలిసి చిరంజీవి స్టెప్పులు వేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక రాఘవేంద్ర రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఈయనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అయితే చిరంజీవితో వచ్చిన ఐటమ్ సాంగ్ వెనుక ఒక పెద్ద కథ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి..

ఎందుకంటే మొదట ఐటమ్ సాంగ్ ను  చిరంజీవి, సిల్క్ స్మిత తో మాత్రమే చేయాలి. ఇందుకోసం ఏకంగా ఐదు లక్షల రూపాయలను పెట్టి ఒక భారీ సెట్ ను వేయడం జరిగింది. ఇక ఆ కాలంలో సిల్క్ స్మిత రేంజ్ చాలా ఎక్కువగా ఉండేది. ఇక ఈ పాట కోసం ఆమెకు ఏకంగా 25 వేల రూపాయలను రెమ్యూనరేషన్ గా ఇచ్చి కొద్దినెలల కిందటే  కాల్ షీట్లు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ పాట ప్రత్యేకంగా ఉండాలి అని కాస్ట్యూమ్స్ కోసం ఆమెకు 20 వేల రూపాయలను కూడా అదనంగా ఇచ్చారట. కానీ ఆమె మాత్రం మొదటి రోజు షూటింగ్ మొదలవగానే , అలాగే చింపిరి జుట్టుతో సెట్లోకి అడుగుపెట్టింది.

రాఘవేంద్రరావుకు నచ్చకపోవడంతో మొదట హెయిర్ స్టైల్ ను మార్చమని, కాస్ట్యూమ్స్ కూడా సరిగ్గా వేసుకోమని చెప్పాడట. అయితే సిల్క్ స్మిత అందుకు ఒప్పుకోక,  పైగా దర్శకుడితో వాదనకు దిగినట్టు సమాచారం. అయినా కూడా రాఘవేంద్రరావు పట్టించుకోకుండా , పాటలో కొంత భాగం పొగమంచులో  షూటింగ్ తీయాలని అనుకున్నారు. అయితే ఆమెకు ఇష్టం లేదని , అందుకు పొగ వాతావరణాన్ని దూరం చేసేందుకు ఫ్యాన్ పెట్టింది. ఇక నిర్మాత దేవి వరప్రసాద్ కూడా స్మిత బిహేవియర్ గమనిస్తూనే వచ్చారు.

ఎలాగోల  మొదటి రోజు పూర్తి చేసుకుంది. ఇక రెండవ రోజు కూడా స్మిత ప్రవర్తన అలాగే ఉంది. నటీనటులు దర్శకుడి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి . కానీ ఇక్కడ మాత్రం స్మిత , దర్శకుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఆర్డర్ వేయడంతో కోపం తెచ్చుకొని నిర్మాత,  వెంటనే ఆమెను అక్కడ  నుంచి వెళ్ళిపోమని చెప్పారట. అయితే అప్పటికే సగభాగం స్మితతో పూర్తవడంతో, రెండవ భాగంలో జయమాలిని , అనురాధ ని తీసుకొచ్చి ఈ పాటని చిత్రీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: