స్టార్ కిడ్స్ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. చాలాసార్లు ట్రోలింగ్ బారిన పడతారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందంటే... ఇరా ఖాన్ ప్రస్తుతం తన ప్రియుడు నూపూర్ శిఖారేతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఇరా ఖాన్, నుపూర్ శిఖారే దాదాపు ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పిక్స్ ను పంచుకుంటున్నారు. ఎప్పటిలాగే ఇరా ఖాన్ సోమవారం తన పిక్ కూడా షేర్ చేసింది. ఇందులో ఆమె డెనిమ్ జాకెట్, షార్ట్ ధరించి బెంచ్ మీద కూర్చుని కనిపిస్తుంది. ఆమె ఒడిలో డాగీ కూడా ఉంది. కానీ ఈ పిక్ లో నెటిజన్ల కళ్ళు వేరే విషయంపై పడ్డాయి. ఇంకేముంది వెంటనే ఇరాను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.

ఇరా దృష్టి మొత్తం తన డాగ్ పై కేంద్రీకరించబడిందని ఆమె చుట్టూ ఉన్న విషయాలు విషయాలను పట్టించుకోవట్లేదు అని అనిపించేలా... పిక్ ను బ్లర్ చేశారు. కానీ అందులో బెంచ్ పై కన్పిస్తున్న ఓ ప్యాకెట్ పై నెటిజన్ల దృష్టి పడింది. అది సిగరెట్ ప్యాకెట్‌ అని భావిస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెకు సిగరెట్ పాఠాలు చెప్పడం ప్రారంభించారు. సిగరెట్ తాగితే జరిగే పరిణామాల గురించి కొందరు మాట్లాడుతుంటే... మరికొందరు మాత్రం ఏ బ్రాండ్ తల్లీ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. పైగా అందుకే అంత మత్తుగా ఉందా ? అని ఫోటోను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

ఇరా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లవర్ నుపూర్ శిఖారేతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను  పంచుకుంటుంది. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. నూపూర్ శిఖారే ఫిట్‌నెస్ వ్యవస్థాపకుడు, నిపుణుడు, కన్సల్టెంట్. అతను అమీర్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్. ఇరా ఖాన్‌కు కూడా శిక్షణ ఇచ్చాడు. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో నుపూర్ శిఖారే, ఐరా ఖాన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కుమార్తె ఇరా. ఆమెకు సోదరుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: